Homeతెలంగాణhyderabad:ఒకేరోజు రూ. 3 వేల కోట్లు రైతులకు బదిలీ చేసిన ప్రభుత్వం-మంత్రి గంగుల కమలాకర్

hyderabad:ఒకేరోజు రూ. 3 వేల కోట్లు రైతులకు బదిలీ చేసిన ప్రభుత్వం-మంత్రి గంగుల కమలాకర్

hyderabad:సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ యాసంగిలో రైతాంగానికి సంపూర్ణంగా అండగా ఉండి, పకృతి వైపరిత్యాలకు ఎదురెళ్లి ధాన్యం సేకరించామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. వెల్లడించారు . ఈ విషయాన్ని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఒక్కరోజే రైతుల ఖాతాల్లోకి 3000 కోట్ల రూపాయలు విడుదల చేశామని, మిగతా మొత్తాన్ని సైతం 20వ తేదీకల్లా రైతులకు అందజేస్తామన్నారు.

ఈ యాసంగిలో గురువారం వరకూ 64.52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 11 లక్షల మంది రైతుల నుండి సేకరించామని వీటి విలువ 13,264 కోట్లన్నారు. ఇందులో ఓపీఎంఎస్లో నమోదు చేసిన 10,439 కోట్లలో 9,168 కోట్లను రైతులకు అందించామని  మంత్రి గంగుల కమలాకర్ అన్నారు  . అకాల వర్షాల వంటి విపత్కర పరిస్థితులను ముందుగా అంచనా వేసి పదిరోజులు ముందుగానే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో కన్నా అధికంగా 7034 కొనుగోలు కేంద్రాలను తెరిచి రైతు చెంతకే వెల్లి ధాన్యం సేకరణ చేసామని ఇప్పటికే 90శాతానికి పైగా సేకరణ పూర్తై 6143 కేంద్రాలను మూసి వేసామన్నారు. 18 జిల్లాల్లో సంపూర్ణంగా సేకరణ పూర్తయిందని మిగతా జిల్లాల్లోనూ ఆదివారం వరకూ పూర్తి చేస్తామన్నారు. ఎక్కడైనా ఆలస్యంగా కోతలు చేసిన ప్రాంతాల రైతుల ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని కొనుగోళ్లు చేసేందుకు వీలుగా కలెక్టర్లకు నిర్ణయాధికారం ఇచ్చామన్నారు. గత సీజన్ కన్నా 15లక్షల మెట్రిక్ టన్నులను అధికంగా సేకరించామని మంత్రి గంగుల తెలియజేసారు.

అవసరమైన మేర టార్పాలిన్లు అందుబాటులో ఉంచడంతో పాటు పెద్ద ఎత్తున తెరిచిన సేకరణ కేంద్రాలకు అవసరమైన మాయిశ్చర్ మిషన్లు, వెయింగ్ మిషన్లు, ప్యాడీక్లీనర్లు వంటి మౌళిక వసతులను ప్రభుత్వం సమకూర్చిందన్నారు. తడిసిన ధాన్యాన్ని సైతం సేకరించామని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. యాసంగి ధాన్యం సేకరణలో పాల్గొన్న హమాలీలకు, సహకార సంఘాలకు, మిల్లర్లకు, అధికార యంత్రాంగానికి ప్రతీ ఒక్కరికీ మంత్రి గంగుల కమలాకర్ కృతజ్ణతలు తెలిపారు

Recent

- Advertisment -spot_img