Homeక్రైంHyderabad News : మరో రెండు చోట్ల అగ్నిప్రమాదాలు

Hyderabad News : మరో రెండు చోట్ల అగ్నిప్రమాదాలు

సిటీలోని వేర్వేరు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు జరిగాయి. అమీర్‌పేట్‌ పరిధిలో ఒక అగ్నిప్రమాదం చోటు చేసుకోగా.. పాతబస్తీ పరిధిలోని శాలిబండలో మరొకటి జరిగింది. అమీర్‌పేట పరిధిలోని మధురానగర్‌లో ఫర్నిచర్‌ గోదాంలో మంటలు ఎగసిపడటంతో.. రూ.లక్షల విలువైన ఫర్నిచర్‌ దగ్ధమైనట్లు సమాచారం. షాలిబండలో ప్రాంతంలోని బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ దుకాణంలో సైతం అగ్నిప్రమాదానికి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెస్తున్నారు.

Recent

- Advertisment -spot_img