Homeహైదరాబాద్latest NewsHyderabad Weather Alert: కాసేపట్లో హైదరాబాద్‌లో వర్షం.. ఈ జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులు..!

Hyderabad Weather Alert: కాసేపట్లో హైదరాబాద్‌లో వర్షం.. ఈ జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులు..!

Hyderabad Weather Alert: హైదరాబాద్‌తో సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో కాసేపట్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) సూచించింది. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, వడగళ్ల వాన కూడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణం మార్పు కారణంగా హైదరాబాద్‌లో సాయంత్రం లేదా రాత్రి వేళల్లో వర్షం కురిసే అవకాశం ఎక్కువగా ఉంది. రాగల రెండు రోజుల్లో కూడా రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కొనసాగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Recent

- Advertisment -spot_img