Homeహైదరాబాద్latest News'సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా' : పాంటింగ్

‘సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా’ : పాంటింగ్

అంతర్జాతీయ క్రికెట్‌లో 71 సెంచరీలు చేసిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన మొదటి సెంచరీ నుంచి చివరి సెంచరీ వరకు అన్ని బ్యాట్లను భద్రపరచుకున్నట్లు తెలిపాడు. ఆ బ్యాట్లపై స్టిక్కర్లు కూడా చెరిగిపోలేదని, ప్రత్యర్థి, తేదీతో సహా రాసుకున్నట్లు చెప్పారు. ఈ విషయాలను దిల్లీలో యువ క్రీడాకారులకు క్రికెట్ కిట్ల పంపిణీ చేస్తున్న సందర్భంలో వెల్లడించాడు. తనకు ఇది ఒక అలవాటు అని, అంరికీ కనిపించేలా ఇంట్లో పెట్టుకోకుండా ప్రత్యేక స్థలంలో భద్రపరిచినట్లు తెలిపాడు. తాను కూడా మొదటి సెంచరీ చేసిన బ్యాట్‌ను దాచుకున్నట్లు దిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ గంగూలీ చెప్పాడు.

Recent

- Advertisment -spot_img