Homeహైదరాబాద్latest Newsఆ సినిమా ఒప్పుకుని తప్పు చేశా.. ఆసక్తికర వ్యాఖలు చేసిన టబు..!

ఆ సినిమా ఒప్పుకుని తప్పు చేశా.. ఆసక్తికర వ్యాఖలు చేసిన టబు..!

టాలీవుడ్ సీనియర్ నటి ‘టబు’ ఒకరు. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఈ బ్యూటీ చాలా కాలంగా ఇండస్ట్రీలో తన పాత్రలతో ఆకట్టుకుంటుంది. రీసెంట్ గా బాలీవుడ్ లో క్రూ సినిమాతో అలరించింది. ప్రస్తుతం ఆమె అజయ్ దేవగన్‌తో ఓ చిత్రంలో నటిస్తోంది. నీరజ్ పాండే దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్ట్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. నటి టబు తాజా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తన కెరీర్‌లో ఓ మూవీ ఒప్పుకుని తప్పు చేశానని నటి టబు తెలిపారు. ‘‘డైరెక్టర్ శేఖర్‌కపూర్ ‘ప్రేమ్‌’లో నటించమని అడిగారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నానని చెప్పా. కాకపోతే ఆయన బలవంతం చేయడంతో అంగీకరించా. షూటింగ్‌ మొదలయ్యాక డైరెక్టర్‌గా ఆయన తప్పుకున్నారు. దాదాపు ఐదేళ్లపాటు మూవీని చిత్రీకరించారు. ఆ సినిమాను ఒప్పుకున్నందుకు ఎంతో బాధపడ్డా అని వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img