హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. తాజాగా సోషల్ మీడియాలో పలువురు అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. తన వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ.. తన ఇష్టయిష్టాలను గుర్తించడంలో ఫెయిల్ అయ్యానని సమంత చెప్పింది. లైఫ్ లో తను చేసిన పెద్ద తప్పు ఇదేనని పేర్కొంది. కష్టాల్లో ఉన్నప్పుడే విలువైన పాఠాలను నేర్చుకోవచ్చని చెప్పింది.