‘దేశం గర్వించేలా సినిమా తీస్తాను’ అని అట్లీ తెలిపాడు. ‘జవాన్’ సినిమా తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌తో తన కొత్త సినిమాని అట్లీ ప్రకటించాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. నటీనటుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని, ఆ పాత్రలో రజనీకాంత్ లేదా కమల్ హాసన్ నటించే అవకాశం ఉందని తెలిసింది. ‘జవాన్’ సినిమా తరువాత కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ఖ్యాతి పెరిగింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉన్నాడు. ఆయన తదుపరి సినిమాలపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం అట్లీ ‘బేబీ జాన్’ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్నాడు. ఆయన నిర్మాణంలో తెరకెక్కిన ఇదే మొదటి సినిమా. ఈ సినిమాకి కాలీస్ దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో వరుణ్ ధావన్ హీరోగా నటించాడ. ఈ సినిమా డిసెంబర్ 25న విడుదల కానుంది.