Homeతెలంగాణజనాధరణ కంటే.. డబ్బు ఆదరణే ఎక్కువ... ఇక ఎన్నికల్లో పోటీ చేయను

జనాధరణ కంటే.. డబ్బు ఆదరణే ఎక్కువ… ఇక ఎన్నికల్లో పోటీ చేయను

నేటి రాజకీయాలు డబ్బుతోనే ముడిపడాయన్న సంగతి తెలిసిందే.

జనాధరణ కంటే.. డబ్బు ఆదరణే ఎక్కువ లబ్ధి చేకూరేలా చేస్తోంది.

ఈ విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇకపై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని చిన్నారెడ్డి స్పష్టం చేశారు.

డబ్బులు లేకపోతే ఎవరూ కూడా ఎన్నికల్లో పోటీ చేయవద్దని.. ఇది తన విన్నపమని తెలిపారు.

పట్టభద్రులు సైతం అధికార టీఆర్ఎస్‌కు ఓట్లు అమ్ముకోవటం తనకు చాలా బాధ కలిగిస్తోందని చిన్నారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.

కేవలం డబ్బులు పంచలేకపోవటం వలనే తనకు ఓట్లు పడలేదంటూ వ్యాఖ్యానించారు.

తన పలుకుబడి కేవలం 32వేల ఓట్లకే పరిమితం అనుకుంటున్నానంటూ విస్మయం వ్యక్తంచేశారు.

డబ్బు ఖర్చు చేయటంలో కేసీఆర్‌ను భవిష్యత్‌లో ఎవరు తట్టుకోలేరన్నారు.

నాగార్జునసాగర్‌లో జానారెడ్డి మాత్రమే టీఆర్ఎస్‌కు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తట్టుకోగలరన్నారు.

జానారెడ్డి కూడా పద్దతి మార్చుకొని.. డబ్బులు కుమ్మరించాలని సూచించారు.

తమ పార్టీ నాయకత్వం, రేవంత్ రెడ్డి శక్తికి మించి తనకు సహకరించారన్నారు.

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పునఃనిర్మాణం కోసం పనిచేస్తానని, కేసీఆర్ నుంచి తెలంగాణను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని చిన్నారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో పోటీచేసిన చిన్నారెడ్డి ఎలిమినేషన్ అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు.

It is well known that today’s politics are tied to money.

It is the popularity of money that makes it more profitable than the popularity.

Congress senior leader Chinnareddy made interesting remarks on the matter.

Chinnareddy has made it clear that he will no longer contest in direct elections.

He said that no one should contest the elections without money.

This is his request. Chinnareddy said he was saddened that even the graduates were selling votes to the ruling TRS.

He commented that he did not get votes just because he could not distribute the money.

He expressed amazement that his reputation was limited to just 32,000 votes.

Who in the future will not tolerate KCR spending money.

In Nagarjunasagar, only Janareddy can tolerate TRS and Chief Minister KCR.

Janareddy also changed the method and suggested that the money should be poured.

Their party leadership, Rev. Reddy, said he was cooperating beyond strength.

He called on the Congress to work for the reconstruction of Telangana and to protect Telangana from KCR.

Chinnareddy  expressed confidence that the Congress would win in Nagarjunasagar.

The remarks were made after the elimination of Chinnareddy, who was contesting for the Hyderabad-Rangareddy-Mahabubnagar Graduate MLC seat.

Recent

- Advertisment -spot_img