Homeహైదరాబాద్latest Newsజీవితాంతం చెప్పులు వేసుకోను.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విజయ్ ఆంటోనీ…!

జీవితాంతం చెప్పులు వేసుకోను.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విజయ్ ఆంటోనీ…!

విజయ్ మిల్టన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోని హీరోగా నటిస్తున్న చిత్రం ‘తుఫాన్’. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్‌పై కమల్ బోరా, డి లలిత, బి ప్రదీప్, పంకజ్ బోరా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ నిన్న విడుదలైంది. తుఫాన్ టీజర్ విడుదల కార్యక్రమానికి విజయ్ ఆంటోని చెప్పులు లేకుండా వచ్చారు. దాంతో మీరు ఏదైనా దీక్షలో ఉన్నారా? అని మీడియా ప్రశ్నించగా.. అసలు విషయం చెప్పారు. దాదాపు మూడు నెలలుగా చెప్పులు లేకుండా తిరుగుతున్నానని, భవిష్యత్తులో చెప్పులు వేసుకోనని చెప్పాడు. చెప్పులు ధరించకపోవడానికి ప్రత్యేక కారణం ఏమీ లేదని అన్నాడు. ఒకరోజు నేను చెప్పులు లేకుండా నడిచాను. అప్పుడు నాకు బాగా అనిపించింది. చాలా ప్రశాంతంగా అనిపించి… ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. నేను చెప్పులు లేకుండా వెళ్ళడం ప్రారంభించినప్పటి నుండి నేను ఎటువంటి ఒత్తిడిని అనుభవించలేదని అన్నాడు. అందుకే జీవితాంతం చెప్పులు లేకుండా ఉండాలనుకుంటున్నాను’’ అని విజయ్ ఆంటోని చెప్పారు.

Recent

- Advertisment -spot_img