ICC Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు దక్షిణాఫ్రికా-ఆఫ్ఘానిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. కరాచి వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమయ్యింది. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య 5 వన్డే మ్యాచ్లు మాత్రమే జరిగాయి. ఇందులో దక్షిణాఫ్రికా మూడు గెలవగా, ఆఫ్ఘానిస్తాన్ కేవలం రెండు గెలిచింది. ఈ ట్రోఫీలో సఫారీలు పుంజుకోవాలని ఆరాటపడుతున్నారు. 2023 WC నుంచి అదరగొడుతున్న ఆఫ్ఘానిస్తాన్ మరో సంచలనానికి ఉవ్విళ్లూరుతోంది. ఇవాళి మ్యాచ్లో ఎవరు గెలుస్తారో చూడాలి.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా
దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ చేయనుంది.
ఆఫ్ఘనిస్తాన్: గుర్బాజ్ (W), జద్రాన్, అటల్, రహమత్ షా, షాహిదీ(C), ఒమర్జాయ్, నాయబ్, మహ్మద్ నబీ, రషీద్, ఫరూఖీ, నూర్ దక్షిణాఫ్రికా: ర్యాన్ రికెల్టన్ (W), జోర్జి, బావుమా (C), డుస్సెన్, మార్క్రామ్, మిల్లర్, ముల్డర్, జాన్సెన్, కేశవ్ మహరాజ్, రబడ, లుంగీ ఎన్దిడి.
ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్న సౌతాఫ్రికా స్కోర్ 131, ఒక వికెట్ కోల్పోయింది. మొత్తం 24 ఓవర్లు పూర్తయ్యాయి. క్రీజులో ర్యాన్ రికెల్టన్ 72* (74), తెంబా బవుమా 48* (59) గా ఉన్నారు. టోనీ డి జోర్జీ 11 (11) లకు అవుట్ అయ్యాడు.