Homeజిల్లా వార్తలుఆదర్శనీయం.. ఈ ఆదర్శ దంపతులు..!

ఆదర్శనీయం.. ఈ ఆదర్శ దంపతులు..!

ఇదే నిజం, గొల్లపల్లి : వైద్య విద్యార్థుల పరిశోధన కోసం… తమ మరణానంతరం మెడికల్ కాలేజీకి తమ దేహాలను దానం చేస్తామని జగిత్యాల జిల్లా గొల్లపల్లి గ్రామ లైన్స్ క్లబ్ కోశాధికారి అరుణ్ తన పుట్టినరోజు సందర్భంగా వారి భార్య రాజ్యలక్ష్మి తో కలిసి దంపతులు ప్రకటించారు. ఈ జంట తీసుకున్న ఆదర్శనీయమైన నిర్ణయం అందరికీ స్ఫూర్తినిచ్చింది.అంగీకార పత్రం ఇవ్వడానికి 8 ఇన్ కాలనీ సదాశయ ఫౌండేషన్ ఆఫీస్ కు వచ్చి ఇవ్వడం అందర్నీ అబ్బురపరిచిన ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా ఎనిమిదవ కాలనీలో సోమవారం చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా గొల్లపల్లి వాస్తవ్యులు అరుణ్ ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఈ కార్యక్రమంలో భాగంగా తన పుట్టినరోజు 11 -11-24 పురస్కరించుకొని సమాజ హితం కోరి తమ మరణానంతరం నేత్ర,అవయవ,శరీర దానం చేస్తామని ప్రకటించారు.దంపతులు తీసుకున్న నిర్ణయాన్ని సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి సీహెచ్.లింగమూర్తి,ముఖ్య సలహాదారులు నూక రమేష్,ప్రచార కార్యదర్శి కే.ఎస్.వాసు,పట్టణ కార్యదర్శి బోళ్ల చంద్రశేఖర్ అభినందించారు.దంపతులకు సదాశయ ఫౌండేషన్ అభినందన పత్రం అందజేసి సత్కరించారు.అనంతరం నేత్ర,అవయవ శరీర దానాలపై అవగాహన కల్పించారు.సమాజానికి చక్కటి స్ఫూర్తి సందేశం ఇచ్చారని,లైన్స్ క్లబ్ ఆఫ్ కమాన్పూర్ అధ్యక్ష కార్యదర్శులు రామకృష్ణారెడ్డి శంకర్లు కొనియాడారు.సదాశయ ఫౌండేషన్ చేస్తున్న సేవలను కొనియాడారు.పలువురికి ఆదర్శంగా నిలిచిన ఆదర్శ దంపతులను సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు టి.శ్రావణ్ కుమార్ అభినందించారు.

Recent

- Advertisment -spot_img