Homeహైదరాబాద్latest Newsఇదే నిజం ఎఫెక్ట్ : నీటి సమస్య పరిష్కారానికి కృషి

ఇదే నిజం ఎఫెక్ట్ : నీటి సమస్య పరిష్కారానికి కృషి

ఇదే నిజం, నార్నూర్ : కలుషిత నీరు తాగి 20 మంది అస్వస్థత అనే కథనానికి స్పందించిన అధికార యంత్రాంగం ఆదివారం (May 26) లోకారి(బి)కి కదిలి వచ్చింది. లోకారి(బి) గ్రామాన్ని వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు ఆ గ్రామాన్ని సందర్శించారు. గ్రామ ప్రజల ఆరోగ్యంపై డిప్యూటీ DMHO విజయ్ కుమార్ ఆరా తీసి, వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. RWS ఎస్ఈ సురేష్ బావి దగ్గరికి వెళ్లి నీటిని పరిశీలించారు. నీటి నమునా లను పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించారు. ఈ నివేదికను ITDA పిఓ కు నివేదిక సమర్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో RWS ఈఈ చంద్రమోహన్, డిఈ శ్రీనివాస్, ఐటీడీఏ ఏవో రాంబాబు, డిఎల్ పిఓ ప్రభాకర్, డిప్యూటీ డిఎంహెచ్ఓ విజయ్ కుమార్, ఎంపీడీవో రమేష్, వైద్యాధికారి సంజీవ్, గ్రామ పెద్దలు రూపుదేవ్ పటేల్, శేఖర్ బాబు, చంద్రహరి, కార్యదర్శి రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img