Homeజిల్లా వార్తలుగోడలపై నకిలీ ఇంటి నెంబర్లు రాసుకుంటేకఠిన చర్యలు తీసుకుంటాం

గోడలపై నకిలీ ఇంటి నెంబర్లు రాసుకుంటేకఠిన చర్యలు తీసుకుంటాం

– కమిషనర్‌ రాజేంద్రకుమార్‌

ఇదేనిజం, మల్కాజగిరి : ఇంటిగోడలపై నకిలీ ఇంటి నెంబర్లు రాసుకుంటే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని కమిషనర్‌ రాజేంద్రకుమార్‌ హెచ్చరించారు. నాగారం మునిసిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్‌ టీవీ 83, 84 ప్రభుత్వ భూమిలో అక్రమంగా రూము నిర్మించి ఇష్టానుసారనగా ఇంటినెంబర్‌ రాసుకుంటున్నారు. మునిసిపాలిటీ నుంచి ఇంటినెంబర్‌ మంజూరు కాకుండానే గోడల మీద నకిలీ నెంబర్‌ రాసుకుంటున్న వారిపై మునిసిపల్‌ మేనేజర్‌ చంద్రశేఖర్‌, శానిటరీ ఇన్‌ప్పెక్టర్‌ రాంరెడ్డి చర్యలకు ఉపక్రమించారు. ఈ సందర్భంగా పలు ఇళ్ల గోడలుపై రాసిన నకిలీ నెంబర్లును సిబ్బందితో తుడిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూమిని ఎవరు కబ్జా చేస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అక్రమణ దారులు ఎంతటి వారైనా చట్ట పరమైన చర్యలు తప్పవన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img