తెలంగాణలో దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్న ప్రభుత్వం మరో ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఏడాది సొంత స్థలం, రేషన్ కార్డున్న వారికే ఇల్లు ఇవ్వాలని భావిస్తున్నట్లు వినిపిస్తోంది. ఈ నిబంధన వల్ల ఎక్కువగా వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. స్థలం, రేషన్ కార్డున్న వారికే ఇళ్లు ఇస్తే దాదాపుగా 30 లక్షల మంది లబ్ధిదారులు అనర్హులవుతారు.