Homeఆంధ్రప్రదేశ్షర్మిల కాంగ్రెస్​లోకి వెళ్తే..మేం పార్టీ మారతామా?

షర్మిల కాంగ్రెస్​లోకి వెళ్తే..మేం పార్టీ మారతామా?

– ఎంఎస్​ బాబు నిర్ణయం సరికాదు
– ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలి
– మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి

ఇదే నిజం, ఏపీ బ్యూరో: షర్మిల కాంగ్రెస్​ పార్టీలో చేరినంత మాత్రాన తాము కూడా పార్టీ మారాలా? అని మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. సీఎం జగన్​కు ఎవరు వ్యతిరేకంగా పనిచేసినా తాము ప్రతిపక్షంగానే చూస్తామని చెప్పారు. గురువారం చిత్తూరు జిల్లాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పెద్దిరెడ్డి మాట్లాడారు. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్​ బాబు నిర్ణయం సరికాదని చెప్పారు. ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. జగన్‌పై వైసీపీకి చెందిన పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్​ బాబు విమర్శలు చేయడాన్ని పెద్దిరెడ్డి ఖండించారు. జెడ్పీటీసీగా గెలవలేని వ్యక్తిని ఎమ్మెల్యే చేశామన్నది గుర్తించాలన్నారు. పూతలపట్టులో పార్టీ ఇన్​చార్జ్​ను మార్చాలన్న ముఖ్యమంత్రి నిర్ణయంపై విమర్శలు చేయడం ఎంఎస్​ బాబుకు తగదన్నారు.

Recent

- Advertisment -spot_img