Homeహైదరాబాద్latest Newsగైడ్​లైన్​ దాటితే వేటు తప్పదు

గైడ్​లైన్​ దాటితే వేటు తప్పదు

ఇదేనిజం, కరీంనగర్ టౌన్: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతిసేలా.. అంతర్గత విషయాలను బహిర్గతం చేసినా.. అవాస్తవాలను ప్రచారం చేసినా వేటు తప్పదని శ్రేణులకు కరీంనగర్ యూత్​ జిల్లా అధ్యక్షుడు పడాల రాహుల్​ హెచ్చరికలు జారీ చేశారు. మంగళవారం కరీంనగర్​ లో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యూత్ కాంగ్రెస్ శ్రేణులు జిల్లాకు చెందిన కాంగ్రెస్ అగ్రనాయకత్వాన్ని గానీ, పార్టీ అంతర్గత విషయాలపట్ల గానీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సోషల్ మీడియా, ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా అనుచితంగా పార్టీపై అవాస్తవాలు ప్రచారం చేసిన వారు పార్టీ క్రమశిక్షణ చర్యలకు అర్హులు అవుతారని హెచ్చరించారు. యువజన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి విజయమే లక్ష్యంగా ఐకమత్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ మండల స్థాయిలో గ్రామస్థాయిలో స్థానిక నాయకత్వంతో సమన్వయం చేసుకొని, కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ, స్వాతంత్ర సంగ్రామంలో కాంగ్రెస్ పాత్ర, తెలంగాణ ఏర్పాటులో పార్టీ చూపిన చిత్తశుద్ధి, ప్రజల సమైక్యత కోసం పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలను క్షేత్రస్థాయిలో చేరవేయాలని సూచించారు.

Recent

- Advertisment -spot_img