ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూస్తుంటే నాటి హిరణ్యాక్ష పాలన గుర్తుకు వస్తున్నది. అస్మదీయులు, తస్మదీయులు, మనవాళ్ళు పగవాళ్ళు, మన మతం, మన కులం అనే విభజన నడుస్తున్నది అని ఆరోపించారు. ఆనాటి రాక్షస విహారం నేటి పోలీస్ వ్యవహారంగాఉంది అని వైసీపీ నేత విజయసాయిరెడ్డి అన్నారు.