HomeతెలంగాణCongress కు ఓటేస్తే.. BRS ​కు వేసినట్టే..

Congress కు ఓటేస్తే.. BRS ​కు వేసినట్టే..

– ఆ రెండు పార్టీలు ఒక్కటే
– కేసీఆర్​ హామీలన్నీ విస్మరించారు
– మీట్​ ది ప్రెస్​లో బీజేపీ ఎంపీ లక్ష్మణ్​

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్​ పార్టీకి ఓటేస్తే.. బీఆర్ఎస్​ పార్టీకి వేసినట్టేనని బీజేపీ ఎంపీ లక్ష్మణ్​ వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు చాలా మంది బీఆర్ఎస్​ గూటికి చేరారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచినా అదే పరిస్థితి ఎదురవుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ వస్తే కొలువులొస్తాయని.. ఇంటికొక ఉద్యోగం ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ మాట మార్చారని భాజపా ఎంపీ లక్ష్మణ్‌ విమర్శించారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్లో నిర్వహించిన ‘మీట్‌ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘వివిధ శాఖల్లో దాదాపు 3 లక్షల ఖాళీలు ఏర్పడినా వేటినీ భర్తీ చేయలేదు. ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయకపోవడంతో పాఠశాలలు మూతపడుతున్నాయి. పల్లెల్లోని నిరుద్యోగ యువత కొలువుల కోసం పట్నాలకు వచ్చి తల్లిదండ్రులకు భారంగా మారిపోయారు. ఇటీవల నిరుద్యోగ యువతి ప్రవళిక ఆత్మహత్యపై భాజపా నిరసన వ్యక్తం చేస్తే నా మీద అక్రమంగా కేసులు పెట్టారు. 20 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం నమోదు చేసుకున్నారని పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మనే చెప్పారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా వృద్ధులకు పింఛన్లు ఇస్తామని చెప్పి మభ్యపెడుతున్నారు. అలాంటి వారికి ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారు. దళిత ముఖ్యమంత్రి మొదలుకొని డబుల్ బెడ్రూం ఇళ్లు, రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, పోడు భూముల పట్టాలు, గిరిజనులకు రిజర్వేషన్లు బీసీ బంధు, కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేస్తాం ఇలాంటి హామీలన్నీ విస్మరించారు.’ అంటూ లక్ష్మణ్​ విమర్శించారు.

Recent

- Advertisment -spot_img