Homeహైదరాబాద్latest Newsఅవకాశాలు కావాలంటే పడుకోవాల్సిందే.. నటి బోల్డ్ కామెంట్స్

అవకాశాలు కావాలంటే పడుకోవాల్సిందే.. నటి బోల్డ్ కామెంట్స్

సీనియర్ నటి కస్తూరి ఇండస్ట్రీ క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.ఇండస్ట్రీ క్యాస్టింగ్ కౌచ్ బారిన పడని వాళ్లను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చేమో. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్న వాళ్ల జోలికైతే వెళ్లకపోవచ్చు కానీ.. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్లు.. అవకాశాల కోసం ఎదురుచూసే వాళ్లనైతే ఇండస్ట్రీలోని రసికరాజులు. అవకాశం ఇస్తా.. మరి నాకేంటి? అనే వాళ్లకు లొంగేవాళ్లు కొందరైతే.. అలాంటి పాడుపనులకు బలవడం ఇష్టం లేక ఇండస్ట్రీ నుంచి వచ్చేసే వాళ్లు ఇంకొందరు. అది కాకుండా ఎదురుతిరిగితే అవకాశాలు లేకుండా చేసిన సందర్బాలూ ఉన్నాయి. అలాగే వాళ్లకి లొంగిన తర్వాత కొందరిని అగ్రపీఠంపై కూర్చోబెట్టిన సందర్భాలూ ఉన్నాయి. అలాగే అన్ని విధాలుగా వాడుకుని గెంటేసినా సందర్భాలూ ఉన్నాయి.

సీనియర్ నటి కస్తూరి తెలుగుతోపాటు తమిళ్, మలయాళం సినిమాలు కూడా చేసింది. అక్కడ కూడా బాగానే పాపులారిటీ సంపాదించింది. బోల్డ్ కామెంట్స్ తో వివాదాలకు కూడా సై అంది. అయితే తాజాగా కాస్టింగ్ కౌచ్ గురించి ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. ప్రతి ఒక్క నటి ఏదో ఒక ఫేజ్ లో సెక్సువల్ అబ్యూజ్ కచ్చితంగా ఫేస్ చేసి ఉంటుందని.. కానీ కొంతమంది మాత్రమే ఓపెన్ అవుతారని తెలిపింది. ప్రతి రంగంలో ఇది కామన్ అంటూ ఇల్లు కట్టే మేస్త్రి, మహిళా కూలీకి మధ్య కూడా ఇదే ఉంటుందని ఉదహరించింది.

తనకు కూడా లైంగిక వేధింపులు తప్పలేదని అసలు విషయం చెప్పేసింది. టాలీవుడ్ లో ఆ అనుభవం లేదు కానీ కోలీవుడ్, మాలీవుడ్ లో ఎదుర్కొన్నట్లు చెప్పింది. ముఖ్యంగా మలయాళం ఇండస్ట్రీలో ఇవి ఎక్కువ అని.. తన కమ్ బ్యాక్ సినిమా ఫైనల్ అయినప్పుడు, అంతా ఓకే అనుకున్న సమయంలో తనతో పడుకోమని డైరెక్టర్ కోరాడని తెలిపింది. కానీ నో చెప్పడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు వివరించింది. అయితే మాలీవుడ్ ప్రస్తుతం పూర్తిగా చేంజ్ అయిందని చెప్పుకొచ్చింది కస్తూరి.

Recent

- Advertisment -spot_img