Homeహైదరాబాద్latest NewsBJMC పరిధిలోని ఐదో వార్డులో జోరుగా అక్రమ నిర్మాణాలు

BJMC పరిధిలోని ఐదో వార్డులో జోరుగా అక్రమ నిర్మాణాలు

ఇదే నిజం, రాజేంద్రనగర్ : రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ (BJMC) లోని 5వ వార్డులో ఉన్న హైదర్ షాకోట్ కపిల్ నగర్ కాలనీలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అనుమతులు లేకుండా భవన నిర్మాణదారులు బహుళ అంతస్థులు నిర్మిస్తున్నారు. రెండంతస్తుల వరకు అనుమతులు తీసుకొని ఆరు నుంచి 7 అంతస్తులు నిర్మిస్తున్నారు. స్థానిక కార్పొరేటర్ అండదండలతో నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Recent

- Advertisment -spot_img