Homeహైదరాబాద్అక్రమ కట్టడాలపై కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఫెడరేషన్ నేతలు…

అక్రమ కట్టడాలపై కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఫెడరేషన్ నేతలు…

మేడిపల్లి, ఇదే నిజం: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోజు రోజుకు అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయని, వాటిని అరికట్టడంలో స్దానిక అధికారులు ఘోరంగా విఫలమయ్యారని ఆరోపిస్తూ కాలనిల సంక్షేమ సంఘాల సమాఖ్య ( ఫెడరేషన్) అధ్వర్యంలో మేడ్చల్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు అధ్వర్యంలో కార్పోరేషన్ పరిధిలో వివిధ కాలనిలలో చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై గత కొన్ని రోజులుగా సందర్శించి పూర్తి వివరాలతో స్ధానిక కమీషనర్ ను కలిసి వినతిపత్రం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ అక్రమ నిర్మాణాలు స్దానిక అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రోద్బలంతోనే జరుగుతున్నాయని, దీని వల్ల కార్పోరేషన్​కు లక్షలాది రూపాయల ఆదాయం గండి పడుతుందని రాపోలు రాములు అన్నారు. ఈ పరిస్థితులలో కలెక్టర్ తక్షణమే స్పందించి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్​లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకొని, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో ఫెడరేషన్ అధ్యక్షులు కలుకూరి రాములు, చీఫ్ అడ్వైజర్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డిలు ఉన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img