Homeహైదరాబాద్latest Newsయథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా.. లక్షల్లో డబ్బు పోగు చేసుకుంటున్న అక్రమార్కులు

యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా.. లక్షల్లో డబ్బు పోగు చేసుకుంటున్న అక్రమార్కులు

ఇదే నిజం, ధర్మపురి: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలో రాంనూర్ గ్రామ గోదావరీ నది పరీవాహక ప్రాంతం ఇసుక అక్రమ రవాణాకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది.ఈ ప్రాంతం ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువ ప్రాంతం కావడంతో ఎండాకాలం రాగానే ఇసుక బయటకు తేలుతుంది. దీనిని ఆసరాగా చేసుకొని అక్రమార్కులు గత కొన్ని నెలలుగా ఇసుకను బయటకు తరలిస్తూ లక్షల సొమ్ము పోగు చేసుకుంటున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా జెసిపిల సహాయంతో ఇసుకను తరలిస్తున్నారు. అదేవిధంగా రాంనూర్ గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో ఇసుక కుప్పలు నిలువ ఉంచినట్లు అక్కడ స్థానికులు తెలిపారు. ఇష్టానుసారంగా ఇసుకను బయట ప్రాంతాలకు తరలిస్తున్న వ్యక్తులను గుర్తించి వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడి స్థానిక ప్రజలు కోరుతున్నారు.

అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు- తాసిల్దార్ శేఖర్, ఎస్సై ఉమా సాగర్

వెల్గటూర్ మండలంలో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాపై తహసీల్దార్ శేఖర్, ఎస్సై ఉమాసాగర్ లు అప్రమత్తమయ్యారు.కొన్ని రోజుల నుండి గుట్టు చప్పుడు కాకుండా రాత్రుల్లో వెల్గటూర్ మండలంలోని గోదావరి నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ శేఖర్, ఎస్సై ఉమా సాగర్ లు మండలంలో ఇతర గ్రామాలకు తరలిస్తున్న ట్రాక్టర్ల పట్టుకొని కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.మండలం లో ఎవరైనా ఆక్రమ ఇసుక అక్రమ రవాణాకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Recent

- Advertisment -spot_img