Homeబిజినెస్‌IMAX Theater : బ్రాడ్‌వేతో కలిసి కోయంబత్తూరులో ఐమ్యాక్స్‌ థియేటర్‌

IMAX Theater : బ్రాడ్‌వేతో కలిసి కోయంబత్తూరులో ఐమ్యాక్స్‌ థియేటర్‌

IMAX Theater : బ్రాడ్‌వేతో కలిసి కోయంబత్తూరులో ఐమ్యాక్స్‌ థియేటర్‌

IMAX Theater : ఐమ్యాక్స్‌ కార్పోరేషన్‌, బ్రాడ్‌వే మెగాప్లెక్స్‌ నేడు తాము భారతదేశంలోని కోయంబత్తూరులో  బ్రాడ్‌వే  నూతనంగా ప్రణాళిక చేసిన మెగాప్లెక్స్‌ ప్రాంగణంలో నూతన ఐమ్యాక్స్‌(IMAX®️) థియేటర్‌ అభివృద్ధి చేసేందుకు ఒప్పందంపై సంతకాలు చేసినట్లు వెల్లడించాయి.

రాబోయే  2022 సంవత్సరపు వేసవిలో దీనిని తెరిచేందుకు ప్రణాళిక చేశారు.

ఈ ఒప్పందంతో కోయంబత్తూరు నగరంలో మొట్టమొదటి ఐమ్యాక్స్‌ థియేటర్‌ రానుంది.

అంతేకాదు, అంతర్జాతీయ వినోద సాంకేతికత కంపెనీ, ప్రాంతీయ మెగాప్లెక్స్‌ చైన్‌ నడుమ మొట్టమొదటి ఒప్పందంకు ప్రతీకగా కూడా ఇది నిలుస్తుంది.

Read This : పుష్ప రివ్యూ.. కథ, ప్లస్సు.. మైనస్సులు

ఈ నూతన థియేటర్‌లో భావి తరపు లేజర్‌ ప్రొజెక్షన్‌ వ్యవస్థతో కూడిన లేజర్‌ సాంకేతికత మరియు ఐమ్యాక్స్‌ థియేటర్‌లలో ప్రత్యేకంగా కనిపించే 12 ఛానెల్‌ సౌండ్‌ సిస్టమ్‌ ను ఐమ్యాక్స్‌ను కలిగి ఉంటుంది.

లేజర్‌తో కూడిన ఐమ్యాక్స్‌ డిజైన్‌  పరంగా లీనమయ్యే రీతిలో ఉంటుంది.

మరేదీ అందించలేనటువంటి రీతిలో సినీ వీక్షణ అనుభవాల కోసం పూర్తి స్పష్టమైన, జీవిత తరహా చిత్రాలు, ఖచ్చితత్త్వంతో కూడిన ఆడియోను అందించడానికి సూక్ష్మ అంశాలపై కూడా అమిత శ్రద్ధ చూపి అభివృద్ధి చేయడం జరిగింది.

నూతన ఐమ్యాక్స్‌ థియేటర్‌లో  ప్రదర్శించే చిత్రాలను ఐమ్యాక్స్‌  యొక్క ప్రొప్రైయిటరీ డిజిటల్‌ మీడియా రీ–మాస్టరింగ్‌ లేదా డీఎంఆర్‌ ప్రక్రియలో ఆప్టిమైజ్‌ చేయబడతాయి.

ఫిలింమేకర్స్‌ నేరుగా ఇన్‌పుట్‌ అందించడం తో  ఐమ్యాక్స్‌ స్ర్కీన్స్‌ కోసం ఫ్రేమ్‌ బై ఫ్రేమ్‌  చిత్రం వృద్ధి చేయబడుతుంది.

Read This : డేటింగ్​ యాప్స్​ వాడకంలో హైదరాబాద్​ టాప్​.. సర్వేలో మరిన్ని..

‘‘దక్షిణ భారతదేశంలో ప్రాంతీయ మల్టీప్లెక్స్‌ గొలుసుకట్టు సంస్థ బ్రాడ్‌వే మెగాప్లెక్స్‌తో మా మొట్టమొదటి భాగస్వామ్యం చేసుకోవడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము.

దీని ద్వారా నూతన, మహోన్నతమైన మెగాప్లెక్స్‌ ప్రాంగణానికి ఐమ్యాక్స్‌ను తీసుకురాబోతున్నాము.

భారతదేశంలో పెద్ద నగరాలకు ఆవల మా పాదముద్రికలను విస్తరిస్తున్నాము’’అని  జియోవాన్నీ డోల్సీ, చీఫ్‌ సేల్స్‌ ఆఫీసర్‌ , ఐమ్యాక్స్‌ అన్నారు.

‘‘ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లు తెరుచుకుంటున్నాయి.

ఐమ్యాక్స్‌ యొక్క ప్రజాదరణ హాలీవుడ్‌, స్థానిక టైటిల్స్‌ వ్యాప్తంగా  సినీ అభిమానులు, సినీ రూపకర్తలు నడుమ గణనీయంగా వృద్ధి చెందుతుంది.

శక్తివంతమైన బాలీవుడ్‌ శ్రేణి తో భారతదేశంలో వృద్ధి చెందుతున్న డిమాండ్‌ను అందుకోవడం పట్ల మేము చాలా ఆనందంగా ఉన్నాము’’ అని అన్నారు.

Read This : ఎందుకు భార్య కంటే భర్త వయస్సు ఎక్కువ ఉండాలి..

‘‘గత కొద్ది సంవత్సరాలుగా, సామాజికంగా బాధ్యతాయుతమైన విధానంలో వినియోగదారులకు వినోదమందించడానికి పూర్తి అంకితభావంతో బ్రాడ్‌వే కృషి చేస్తుంది.

ప్రతి కోణంలోనూ సుసంపన్నమైన అనుభవాలను అందించగలమని మేము నిర్ధారించుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాము.

అందుబాటులోని అత్యుత్తమ సాంకేతికతతో వినోదం అందించాలనే మా లక్ష్యానికనుగుణంగా ఐమ్యాక్స్‌తో మేము భాగస్వామ్యం చేసుకున్నాము.

ఈ భాగస్వామ్యంతో మేము ప్రపంచశ్రేణి అనుభవాలను కోయంబత్తూరులో మా పై విశ్వాసం చూపుతున్న వినియోగదారులకు తీసుకురాగలము.

ఐమ్యాక్స్‌ వద్ద బృందంతో మేము అతి సన్నిహితంగా పనిచేయడంతో పాటుగా రాబోయే సంవత్సరాలలో మా భాగస్వామ్యాన్ని మరింతగా బలోపేతం చేసుకోగలము’’ అని బ్రాడ్‌వే మెగాప్లెక్స్‌ ప్రతినిధి వెల్లడించారు.

Read This : ఇక తెలంగాణాలో భగ్గుమననున్న కరెంటు బిల్లు

ఐమ్యాక్స్‌లో అత్యంత అధునాతనమైన థియేటర్‌ అనుభవం,  బ్రాడ్‌వే మెగాప్లెక్స్‌ వద్ద లేజర్‌తో కూడిన ఐమ్యాక్స్‌.

నూతన ఆప్టికల్‌ ఇంజిన్‌తో కూడిన విప్లవాత్మక 4కె లేజర్‌ ప్రొజెక్షన్‌ సిస్టమ్‌, అనుకూలీకరించబడిన డిజైన్‌ లెన్స్‌లతో పూర్తి వైవిధ్యంగా ఉండటంతో పాటుగా ఐమ్యాక్స్‌కు  సొంతమైన సాంకేతికతలు ప్రకాశవంతమైన చిత్రాలను వృద్ధి చేసిన రిజల్యూషన్‌, లోతైన కాంట్రాస్ట్‌, విస్తృతశ్రేణి రంగులు వంటివన్నీ కూడా ఐమ్యాక్స్‌ స్ర్కీన్‌లకు ప్రత్యేకం.

Recent

- Advertisment -spot_img