Homeహైదరాబాద్హంగు ఆర్భాటాలు లేకుండా నిమార్జనాలు

హంగు ఆర్భాటాలు లేకుండా నిమార్జనాలు

  • కోవిడ్ తో మారిన గణేష్ నిమర్జనాలు
  • భారీ వాహనాలు లేకుండా కారుపైనే నిమార్జనానికి ఏర్పాట్లు
  • గ్రామాల్లోని చేరువుల్లోనే నిమర్జనాలు

మంచాల, ఇదేనిజం : భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే గణేష్ నవరాత్రులు కోవిడ్ నిబంధనలతో పండుగల నిర్వహణను కూడా మార్చేసింది. నిమర్జనాలు చేసే క్రమంలో నిర్వాహకులు హంగుఆర్భాటాలు లేకుండా పూర్తిచేస్తున్నారు. గ్రామాల్లో భారీ వాహనాలను వినియోగించకుండా కార్లపైనే వినాయకుడి విగ్రహాలను తీసుకెళ్లి నవరాత్రులు కాకుండా 3 రోజులకే చెరువుల్లో నిమార్జనం చేశారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలకేంద్రంలో  విశ్వహిందూ పరిషత్ ఏర్పాటుచేసిన వినాయకుడిని మంగళవారం నిమార్జనం చేశారు. కేవలం వినాయకుడి నవరాత్రుల నిర్వహణ విషయంలోనే ప్రభుత్వం షరతులను బలవంతంగా హిందువులపై రుద్దడంతో చాలా చోట్ల నిర్వాహకులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధనలు కూడా ఒక్కోచోట ఒక్కోవిధంగా పాటిస్తున్నారని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పేర్కొంటున్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img