Homeసైన్స్​ & టెక్నాలజీSmart Phone : కొత్త‌ మొబైల్ కొనేటప్పుడు పాటించాల్సిన‌ ఏడు విషయాలు

Smart Phone : కొత్త‌ మొబైల్ కొనేటప్పుడు పాటించాల్సిన‌ ఏడు విషయాలు

Smart Phone : కొత్త‌ మొబైల్ కొనేటప్పుడు పాటించాల్సిన‌ ఏడు విషయాలు

Smart Phone : స్మార్ట్ ఫోన్ అందుబాటులో లేకపోతే పూట గడవని పరిస్థితి ఏర్పడింది.

మనం ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ఎటు వెళ్లినా ఫోన్ తప్పనిసరి అయిపోయింది.

కొత్త టెక్నాలజీలన్నీ చాలా వరకూ స్మార్ట్ ఫోన్ల చుట్టూనే తిరుగుతున్నాయి.

మార్కెట్లో లెక్కలేనన్ని కంపెనీలు. వాటిల్లో రకరకాల మోడల్స్.

ఏది కొనుక్కోవాలి? ఎంత ఖర్చు పెట్టాలి? కొన్నది ఎంత కాలం మన్నుతుంది? ఇవన్నీ మన ముందుండే ప్రశ్నలు.

ఒక స్మార్ట్ ఫోన్ కొనాలంటే ముఖ్యంగా వేటిపై దృష్టి పెట్టాలి? గిగాహెర్ట్స్, స్పేస్, ఆపరేటింగ్ సిస్టమ్‍, పిక్సల్స్ ఇలా పలు అంశాలు ఉంటాయి.

వీటిల్లో ఏది ముఖ్యం? చూద్దాం.

మొదటి ప్రశ్న: స్మార్ట్ ఫోన్ ఎందుకు? ఎవరికి?

మొబైల్ ఫోన్ ఎవరు వాడతారు, దేనికి వాడతారు, ఎంత మేరకు వాడతారు అన్నవాటిపై అవగాహన కలిగి ఉండడం తొలి అడుగు. ఈ ప్రశ్నలకి జవాబులు మూడు కేటగిరీలని అనుకోవచ్చు.

Rakesh jhunjhunwala : ఒకే రోజులో రూ. 861 కోట్లు సంపద‌

Financial Security : హైదరాబాద్ లో ఆర్థిక భద్రత తక్కువే!.. మెట్రో నగరాలపై తాజా సర్వే

  1. తేలికపాటి వాడకం: కాల్స్, చాట్స్, బ్రౌజింగ్, సోషల్ మీడియా మొదలైనవాటికి రోజులో కాసేపు ఫోన్ వాడేవాళ్లు.
  2. మధ్యస్థ వాడకం: పైన చెప్పినవి ఎక్కువగా చేయాల్సిన అవసరంతో పాటు వీడియో కాన్ఫరెన్సింగ్, గేమింగ్ కంటెంట్ ఒక మోస్తరుగా వాడేవాళ్ళని అనుకోవచ్చు.
  3. భారీ వాడకం: వీడియో మేకింగ్, హై ఎండ్ గేమ్స్, చాలా యాప్స్ మధ్య స్విచ్ అవ్వాల్సిన అవసరం ఉండడం.

వీటికి తగ్గట్టుగానే మార్కెట్లో అందుబాటులో ఉన్న ఫోన్లను మూడు రకాలుగా విభజించవచ్చు.

  1. లో ఎండ్ ఫోన్: స్క్రీన్ సైజు, మెమరీ, కెమేరా పనితనం తక్కువగా ఉండి, కొంచెం పాత ఆపరేటింగ్ సిస్టమ్‍ వర్షన్‍లతో ఉంటుంది.
  2. మిడ్ రేంజ్/బడ్జెట్ ఫోన్: స్క్రీన్ సైజు ఓ ఐదు ఇంచులు ఉండి, కెమరా పనితనం ఒక మోస్తరుగా ఉండి, ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్‍లు అప్‍డేట్ అవుతున్న కొద్దీ తీసుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది.
  3. హై ఎండ్ ఫోన్: పెద్ద స్క్రీన్‍తో, సరికొత్త ఫీచర్లతో, ఊహించలేనంత మంచి కెమరా పనితనంతో, భారీ వాడకానికి బాగా పనికొచ్చేట్టు ఉంటుంది.

మొబైల్ ఎంపికలో పరిగణలోకి తీసుకోవాల్సిన ఏడు అంశాలు

Post Office Scheme : పోస్టాఫీస్‌లో ఇలా నెల‌కు రూ.4,950 ఆదాయం

Credit Card Money Draw : క్రెడిట్ కార్డు నుంచి చార్జీలు ప‌డ‌కుండా డ‌బ్బు డ్రా చేయ‌డం ఎలా..?

ఆపరేటింగ్ సిస్టమ్

స్మార్ట్ ఫోన్‍ విషయంలో ముఖ్యంగా రెండు ఆపరేటింగ్ సిస్టమ్స్ మార్కెట్లో ఉన్నాయి. ఒకటి ఆపిల్ కంపెనీ iOS. ఇంకోటి గూగుల్ ఆండ్రాయిడ్.

iOS: ఆపిల్ ఐఫోన్స్, ఐపాడ్స్ వగైరాలు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మీదే నడుస్తాయి. ఇక్కడ గమనించుకోవాల్సినవి రెండు విషయాలు.

ఒకటి, ఈ iOS ఆపిల్ డివైజులకి మాత్రమే ప్రత్యేకం. వేరే ఏ ఇతర కంపెనీ దీన్ని వాడలేరు.

రెండవది, ఐఫోన్ కొనుక్కుంటే దాని ఎకోసిస్టమ్ మాత్రమే వాడుకోవాలి.

అంటే, ఆపిల్ యాప్‍స్టోర్‍లో ఉన్నవే వాడుకోవాలి.

ఐఫోన్స్ చూడ్డానికి చాలా అందంగా, స్క్రీన్ డిస్‍ప్లే గొప్పగా ఉంటూ, హై ఎండ్‍ కెమెరాలు ఉంటాయి.

అందుకే వాటి ఖరీదు కూడా ఎక్కువే.

ఆండ్రాయిడ్: ఆపిల్‌లా కాకుండా దీన్ని ఓపెన్ సోర్స్ చేయడంతో ఏ మొబైల్ కంపెనీ వారైనా దీన్ని తమ ఫోనుల్లో వాడచ్చు.

గూగుల్ ప్లేస్టోర్‍లు పెట్టే యాప్స్ ఇందులో వేసుకోవచ్చు. ఈ ఆపరేటింగ్ సిస్టమ్‍తో ఉన్న ఫోన్లు రకరకాల ధరల్లో కనిపిస్తాయి.

అయితే, ఫోన్ కొనేటప్పుడు మరీ పాత OS వర్షన్ ఉన్న మోడల్ కొనకుండా ఉంటే మంచిది.

పాత వర్షన్లలో ఏవన్నా సెక్యూరిటీ సమస్యలు వచ్చినా, కొత్తగా వచ్చే యాప్‍లు పనిచేయకపోయినా ఫోన్ దండగైపోతుంది.

Curd : పెరుగుతో ఈ ప‌దార్థాల‌ను క‌లిపి తింటే అనేక లాభాలు

Pimples : మొటిమ‌లను త‌గ్గించే అద్భుత‌ చిట్కా

బ్యాటరీ లైఫ్

మనం పైన చెప్పుకున్నట్టు, ఎంత భారీగా ఫోన్ వాడితే బ్యాటరీ అంత ఎక్కువ ఖర్చవుతుంది.

కొనేటప్పుడు బ్యాటరీ లైఫ్ చూసుకోవాలి. ఎన్ని ఎక్కువ గంటలు ఛార్జింగ్ లేకుండా నడిస్తే అంత మంచిది.

కనీసం, ఆరు గంటల స్క్రీన్ టైమ్ ఉంటే మంచి బ్యాటరీ లైఫ్ అనుకోవచ్చు.

బ్యాటరీతో సమస్యలు వస్తే కొన్ని మోడల్స్‌లో రీప్లేస్ చేసుకోవచ్చు.

అయితే, బ్యాటరీ వల్ల ఫోన్ బాగా వేడెక్కిపోవడం లాంటివి జరుగుతుంటే మాత్రం ప్రమాదకరం.

అంత వేడెక్కిన ఫోన్లని చేతుల్లో, చెవుల దగ్గరా పెట్టుకుంటే కష్టం. కొన్నిసార్లు పేలవచ్చు కూడా.

మొబైల్ వాడేటప్పుడు కూడా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి.

ఫోన్ ఎనభై శాతం వరకూ ఛార్జ్ అయితే ఛార్జింగ్ తీసేయచ్చు. వంద శాతం వరకూ ఉంచకపోవడం మంచిది.

రాత్రంతా ఫోన్‍ ఛార్జింగ్‍లో పెట్టి వదిలేయడం మంచిది కాదు.

ఫోన్ ఛార్జింగ్‍లో ఉండగా, అంటే కేబుల్ ఇంకా అటాచ్ అయి ఉండగా వాడకుండా ఉంటే మేలు.

లేకపోతే బ్యాటరీకి పవర్ సప్లై చేసే కాంపొనెంట్స్‌లో సమస్యలు వచ్చి, ఛార్జింగ్ అవ్వడంలో సమస్యలు మొదలవుతాయి.

Morning Food : ఉద‌యాన్నే వీటిని తింటే రోజంతా ఉత్సాహం

Before Death : మ‌నిషి చ‌నిపోవ‌డానికి ముందు ఏమౌతుంది

ప్రాసెసర్

ఓ రకంగా ప్రాసెసర్ స్మార్ట్ ఫోన్ బ్రెయిన్ అనుకోవచ్చు.

ఫోన్‌లో యాప్స్ ఓపెన్ చేయడం, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడం, వీడియోలు ప్లే చేయడం, గేమ్స్ ఆడడం మొదలైనవన్నీ ప్రాసెసర్ పనితనం మీదే ఆధారపడతాయి.

అది ఎంత బాగా పనిచేస్తే మనకు అంత సౌలభ్యంగా ఉంటుంది.

అంతే కాక, హార్డ్‌వేర్‍ని సపోర్ట్ చేసే మాడ్యూల్స్ కూడా ప్రాసెసర్ చూసుకుంటుంది.

అంటే, కెమెరా, వైఫై, స్క్రీన్, గ్రాఫిక్స్, బ్లూటూత్ లాంటివాటినన్న మాట.

ప్రాసెసర్ ఎంత మెరుగ్గా ఉంటే ఇవన్నీ అంత సమర్ధవంతంగా పనిచేస్తాయి.

ప్రాసెసర్‌ను రెండు విధాలుగా ఎన్నుకోవచ్చు.

Number of Cores & Clock Speed: ప్రాసెసర్‌లో ఒకటి లేదా అంతకు మించి cores ఉంటాయి.

ఒక్కో కోర్ దానికి అప్పజెప్పిన పనిని, ఒకదాని తర్వాత ఒకటి చేసిపెడుతుంది.

ఆ లెక్కన ఎన్ని కోర్స్ ఉంటే అన్ని ఎక్కువ పనులు ఒకేసారి జరుగుతాయి.

Kidney Stones : ట‌మాటాల‌ను తింటే కిడ్నీ స్టోన్లు ఏర్ప‌డుతాయా ?

Shopping Tricks : బ్రాండెడ్​ షర్టులు తక్కువ ధరకే కావాలా.. ట్రిక్స్​

ప్రస్తుతం మల్టీ-కోర్ ప్రాససర్లతో, అంటే రెండు (dual-core), నాలుగు(quad-core) కోర్స్‌తో మోడల్స్ వస్తున్నాయి.

ప్రాసెసర్లని వాటి క్లాక్ స్పీడ్స్.. గిగాహెర్ట్స్ (Ghz)లో కొలుస్తారు. దాన్నిబట్టీ కూడా అంచనా వేయవచ్చు.

కోర్స్ ఎన్ని ఉన్నాయి అన్నదానితో పాటు, అవి ఎంత వేగవంతంగా పని చేయగలుగుతాయి అన్నది కూడా ముఖ్యమే.

సావకాశంగానో, నీరసంగానో పనిచేసేట్టు అయితే ఎన్ని కోర్స్ ఉండి ఏం లాభం? అలా అని మరీ వేగంగా పనిచేసేవి అయితే బాటరీని స్వాహా చేసేస్తాయి.

అందుకని power vs efficiency ఆటలో రెంటికీ డ్రా అవ్వాలి. అవి సమ ఉజ్జీలుగా ఉంటేనే ఫోన్ బాగా పనిచేస్తుంది.

బ్రాండ్, సిరీస్ బట్టి సెలెక్ట్ చేసుకోవడం

కోర్స్, క్లాక్ స్పీడులు అంత తేలికగా అర్థమయ్యే విషయాలు కావు.

కొంచెం ఓపికగా అవగాహన పెంచుకోవాలి. రివ్యూలు చదివి, తెలిసిన నిపుణలతో మాట్లాడితే మంచిది.

అంత ఓపిక లేదనుకున్నప్పుడు బ్రాండ్ మీద నమ్మకం పెట్టుకోవచ్చు.

ప్రాసెసర్లని తయారు చేసేవి రెండు కంపెనీలు.. క్వాల్‍కామ్ (Qualcomm), మీడియా టెక్ (Media Tech). ఆపిల్, సామ్‍సంగ్ తయారుచేసే ప్రాసెసర్లను వాళ్ల డివైజుల్లో మాత్రమే వాడుతుంటారు.

Commercial Crops : వ్యవసాయంతో 3 నెలల్లో 3 లక్షలు సంపాదించే అవకాశం

Lemon Water : లెమ‌న్ వాట‌ర్‌ను ఎప్పుడు తాగితే మంచిది ?

క్వాల్‍కామ్‍కి ఈ విషయంలో మంచి పేరుంది. సామ్‍సంగ్, ఎల్.జి, మోటరోలా కంనెనీలు ఈ ప్రాససర్లని వాడతాయి.

మీడియా టెక్ కూడా ప్రాచుర్యంలో ఉంది. దీన్ని వివో, ఒప్పో, ఆనర్ లాంటి కంపెనీలు వాడుతున్నాయి.

ఫోన్ కొనే ముందు ప్రాసెసర్ గురించి కూడా కొంత తెలుసుకుని ప్రోసీడ్ అవ్వడం మంచిది.

RAM

RAM అంటే, తాత్కాలికమైన మెమరీ. మనం యాప్స్ ఓపెన్ చేసినప్పుడు, టైప్ చేసినప్పుడు అన్నీ రామ్‍లో ఉంటాయి.

ఎంత ఎక్కువ రామ్ ఉంటే అన్ని ఫైల్స్, యాప్స్ ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు.

అలా పెట్టుకోవడం వల్ల సమాచారాన్ని తేలిగ్గా access చేసుకోవచ్చు.

ప్రతీసారి పర్మనెంట్ మెమరీకి వెళ్లి రావాలంటే సమయం, ఎనర్జీ కావాలి.

Zinda Tilismath : హైదరాబాదుకు చెందిన జిందా తిలిస్మాత్ చరిత్ర, ఎలా చేస్తారు?

Egg Quality test : గుడ్డు తాజాద‌నాన్నిక‌నిపెట్టేందుకు సింపుల్ ట్రిక్స్..

రామ్ మామూలుగా 4GB, 8GB, 16GB అని ఉంటుంది. ఐఫోన్లలో తక్కువ రామ్ ఉన్నా బాగా పనిచేస్తాయి.

ఎందుకంటే అంత తక్కువలోనూ బాగా పనిచేసే విధంగా, సమర్థవంతంగా డిజైన్ చేశారు.

ఆండ్రాయిడ్ ఫోన్‍లు అలా పనిచేయవు. మల్టీటాస్కింగ్ చేయాలంటే 8GB అయినా ఉండాలి.

స్క్రీన్ సైజ్

ఎక్కువగా గేమ్‌లు ఆడుతూ, సినిమాలు చూసేవారికి స్క్రీన్ సైజ్ పెద్దదిగా ఉంటే మంచిది.

కనీసం ఐదు ఇంచులు. కానీ స్క్రీన్ సైజ్ పెద్దది అయే కొద్దీ ఫోన్ సైజ్ పెద్దది అవుతుంది.

చేతికి బరువుగా, పాకెట్లో పట్టకుండా ఇబ్బంది పెడుతుంది.

స్క్రీన్ సైజ్‌తో పాటు డిస్‍ప్లే టైప్ (LED, OLED, AMOLED) గురించి తెలుసుకోవడం కూడా అవసరమే.

కెమెరా క్వాలిటీ, టైప్

అసలు కొత్త ఫోన్ కొన్నామని చెప్పగానే, “కెమరా ఎలా ఉంది?” అనే అడుగుతున్నారు.

కెమెరా అంత ముఖ్యమైపోయింది . ఫోన్‌ను కాల్స్ కన్నా ఫోటోలు, వీడియోలకు ఎక్కువ వాడుతున్నారు.

కెమెరా విషయంలో మెగాపిక్సల్ గమనించాలి.

ఒక మెగాపిక్సల్ (Mp) = 1 మిలియన్ (పది లక్షల) పిక్సల్స్.

ఒక ఫోన్‍లో 12Mp కెమరా ఉందంటే అది తీసే ఫోటోలో 12 మిలియన్ల పిక్సల్స్ ఉంటాయని అర్థం.

Chicken : చికెన్‌ను స్కిన్‌తో తింటే మంచిదా.. కాదా..

No to Onion : పూజలున్న‌ప్పుడు వంట‌ల్లో ఉల్లి, వెల్లుల్లి ఎందుకు వాడ‌రు

దీని గురించి పెద్ద హైరానా పడనవసరం లేదు.

కెమెరా టైప్ కూడా చూసుకోవాలి. ఇందులో రెండు రకాలు.. వైడ్ యాంగిల్ కెమెరా (మామూలు ఫొటోలకు అవసరం పడేది), అల్ట్రా వైడ్ యంగిల్ కెమెరా (వైడర్ ఇమేజ్ కావాలనుకున్నప్పుడు వాడేది).

ఈమధ్య కాలంలో వస్తున్న మోడల్స్‌లో ఒకటి కన్నా ఎక్కువ కెమెరాలు ఉంటున్నాయి.

దానికి తగ్గట్టే వాటి ఖరీదు కూడా. అయితే ఎన్ని ఎక్కువ కెమెరాలుంటే అంత మంచి ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చన్న గ్యారంటీ లేదు.

ఉన్న కెమెరాలు ఎంత బాగా పనిచేస్తున్నాయన్నదే కీలకం.

స్మార్ట్ ఫోన్ కొన్నాక తీసుకోవలసిన అయిదు జాగ్రత్తలు

  1. స్మార్ట్ ఫోన్ పోతే వెతుక్కోడానికి వీలుగా ఫీచర్ ఇస్తున్నారు. అది యాక్టివేట్ చేసి పెట్టుకోవడం మేలు.
  2. ఫోన్ పోయినా, పాడైపోయినా అందులో ఉన్న డాటా (ఫొటోలు, వీడియో, చాట్స్) పోకుండా ఉండడానికి ఎప్పటికప్పుడు బ్యాకప్ తీసుకునే ఫీచర్లు ఇస్తున్నారు.
  3. అకౌంట్ క్రియేట్ చేసుకుని క్లౌడ్ (గూగుల్ డ్రైవ్, వన్ డ్రైవ్) లాంటి వాటిల్లో స్టోర్ చేసుకుంటే మంచిది.
  4. అనుమానస్పద యాప్స్‌గానీ, లింక్స్‌గానీ తెరవకూడదు.
  5. ఫోన్ కంపెనీ వాళ్లు వేసిన యాప్స్ తప్పించి, మీకు సంబంధం లేకుండా డౌన్‌లోడ్ అయిన యాప్ ఏదీ మీ ఫోన్‍లో ఉంచొద్దు.
  6. ఫోన్ వేడెక్కిపోవడం, మాటిమాటికీ రీబూట్ అవ్వడం లాంటివి జరుగుతుంటే అలక్ష్యం చేయవద్దు.
  7. వెంటనే బాగు చేయించుకోవాలి.
  8. ప్రస్తుతం డిజిటల్ పేమెంట్స్‌తో పాటు పర్సనల్, ఆఫీస్ పనులకీ ఫోన్ వాడుతున్నాం కాబట్టి యాంటీ వైరస్, ఫోన్ సెక్యూరిటీ యాప్స్ వేసుకోవడం మంచిది.

Specialty of Kashi : కాశీలోని కొన్ని వింతలు..విశేషాలు..!

Beauty Tips : మొటిమలు, మచ్చల నివార‌ణ‌కు ‘వేప’ ప్యాక్‌

Recent

- Advertisment -spot_img