Homeఫ్లాష్ ఫ్లాష్Amazon : కరోనా బారీన పడ్డ 20 వేల మంది ఉద్యోగులు

Amazon : కరోనా బారీన పడ్డ 20 వేల మంది ఉద్యోగులు

శాన్ ఫ్రాన్సిస్కో: అమెజాన్​లో పనిచేసే దాదాపు 20 వేల మంది ఉద్యోగులు కరోనా కొరల్లో చిక్కినట్లు స్వయంగా అమెజాన్​ ప్రకటించింది.

దాదాపు 650 సైట్ల ద్వారా అమెజాన్‌ రోజుకు 50,000 పరీక్షలను నిర్వహించిందని సీటెల్ ఆధారిత సంస్థ తెలిపింది.

ప్రపంచ వ్యాప్తంగా అమెజాన్​ సంస్థకు ఉన్న 1.37 మిలియన్​ ఉద్యోగులు ఉన్నారు. ఇందులో యునైటెడ్ స్టేట్స్‌లోని హోల్ ఫుడ్స్ మార్కెట్, కిరాణా దుకాణాల్లో పనిచేసే ఉద్యోగులు ఉన్నారు.

తమ సంస్థలో పనిచేసే ఉద్యోగుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నట్లు అమెజాన్​ వెల్లడించింది.

అయితే దీనిపై కొందరు ఉద్యోగులు బాహాటంగానే అమెజాన్​ మేనేజ్​మెంట్​పై విమర్శలు చేస్తున్నారు.

లాజిస్టిక్స్‌ కేంద్రాల్లో కరోనా బారీన పడ్డ కొంత మంది ఉద్యోగుల వివరాలను వెల్లడించేందుకు, కరోనా సోకిన తమ సహ ఉద్యోగుల గురించిన సమాచారాన్ని పంచుకోవటానికి సంస్థ అంగీకరించడం లేదని కొందరు ఉద్యగులు సోషల్​ మీడియాలో ఎండగడుతున్నారు.

Amazon itself claims that nearly 20,000 employees got corona.

Recent

- Advertisment -spot_img