పవిత్రమైన వివాహబంధంతో ఒక్కటైన భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా, నిండు నూరేళ్ల జీవితాన్ని ప్రారంభించాలి. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ తమ జీవన ప్రయాణాన్ని సుఖమయంగా ఉంచుకోవాలి. భార్యాభర్తలు ఇరువురూ తనువులు వేరైనా మనసులు ఒకటిగా నిలుపుకోవాలి. జీవన ప్రయాణంలో ఎలాంటి దాపరికాలు ఉండరాదు. వారి మనసులోని అభిప్రాయాలను ఒకరికొకరు తెలియచేసుకోవాలి. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరికొకరు తక్కువగా చూసుకోరాదు. ఇద్దరూ సమానం అనే భావన కలిగి ఉండాలి. ఒకరిపై ఒకరికి నమ్మకం, ప్రేమ, గౌరవం ఏర్పడాలి. వారి అభిప్రాయాలను గౌరవించుకోవాలి. భర్త వేసే ప్రతి అడుగులో నేను మీకు తోడుగా ఉన్నానంటూ భార్య ప్రోత్సహించాలి. అన్యోన్య దాంపత్యంలో భార్యదే కీలక పాత్ర అని సర్వేలు కూడా చెప్తున్నాయి. వివాహబంధంతో ఒక్కటైన భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా, నిండు నూరేళ్ల జీవితాన్ని ప్రారంభించాలి. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ తమ జీవన ప్రయాణాన్ని సుఖమయంగా ఉంచుకోవాలి. భార్యాభర్తలు ఇరువురూ తనువులు వేరైనా మనసులు ఒకటిగా నిలుపుకోవాలి. జీవన ప్రయాణంలో ఎలాంటి దాపరికాలు ఉండరాదు. వారి మనసులోని అభిప్రాయాలను ఒకరికొకరు తెలియచేసుకోవాలి. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరికొకరు తక్కువగా చూసుకోరాదు. ఇద్దరూ సమానం అనే భావన కలిగి ఉండాలి. ఒకరిపై ఒకరికి నమ్మకం, ప్రేమ, గౌరవం ఏర్పడాలి. వారి అభిప్రాయాలను గౌరవించుకోవాలి. భర్త వేసే ప్రతి అడుగులో నేను మీకు తోడుగా ఉన్నానంటూ భార్య ప్రోత్సహించాలి. అన్యోన్య దాంపత్యంలో భార్యదే కీలక పాత్ర అని సర్వేలు కూడా చెప్తున్నాయి.