తెలుగు బిగ్బాస్ సీజన్ 8 హౌస్లో అడుగుపెట్టిన ‘మై విలేజ్ షో’ ఫేమ్ గంగవ్వ ఇటీవల వివాదంలో చిక్కుకుంది. గతంలో ఓ వీడియో కోసం గంగవ్వతో పాటు సహా నటుడు రాజు ఒక చిలకను బంధించి షూటింగ్ చేశారు. దీంతో గంగవ్వపై కేసు నమోదైంది. తాజాగా ఈ కేసులో గంగవ్వకు భారీ ఊరట లభించినట్లు సమాచారం. దీంతో ‘మై విలేజ్ షో’ బృందానికి రూ.25 వేలు జరిమానా విధించినట్లు డీఎఫ్ ఓ తెలిపారు. దీంతో కేసు క్లోజ్ అయింది. అయితే ఈ వన్యప్రాణుల రక్షణ చట్టం గురించి తమకు తెలియదని ‘మై విలేజ్ షో’ టీమ్ సభ్యుడు అనిల్ తెలిపారు. తన యూట్యూబ్ ఛానెల్ నుండి చిలుక జోస్యం వీడియోను కూడా తొలగించినట్లు తెలిపారు.