Homeహైదరాబాద్latest Newsబీజేపీ మ్యానిఫెస్టోలో..బుల్లెట్ రైలు, ఉచిత రేషన్, విద్యుత్, దేశమంతా ఒకేసారి ఎన్నికలు..ఇంకా మరెన్నో!

బీజేపీ మ్యానిఫెస్టోలో..బుల్లెట్ రైలు, ఉచిత రేషన్, విద్యుత్, దేశమంతా ఒకేసారి ఎన్నికలు..ఇంకా మరెన్నో!

వరుసగా మూడోసారి పాలనా పగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న భరతీయ జనతా పార్టీ సంకల్ప పత్రం పేరుతో దిల్లీలోని పార్టీ కార్యాలయంలో మ్యానిఫెస్టో రిలీజ్ చేసింది. ప్రధాని మోదీ, పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ తదితరులు పాల్గొన్నారు.

1. విశ్వ బంధు 2. సురక్షిత భారత్ 3. సమృద్ధ భారత్ 4. గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ 5. ప్రపంచస్థాయి మౌళిక వసతులు 6. ఈజ్ ఆఫ్ లివిగ్ 7. సాంస్కృతిక వికాసం 8. గుడ్ గవర్నెన్స్ 9. స్వస్థ భారత్ 10. అత్యుత్తమ శిక్షణ 11. క్రీడా వికాసం 12. సంతులిత అభివృద్ధి 13. సాంకేతిక వికాసం 14. సుస్థిర భారత్ అనే 14 అంశాలతో మ్యానిఫెస్టోను రిలీజ్ చేశారు.

మ్యానిఫెస్టోలోని కీలకాంశాలు

>పైప్‌లైన్ ద్వారా ఇంటింటికీ వంటగ్యాస్

>ముద్ర రుణాల పరిమితి రూ. 20 లక్షలకు పెంపు

> దివ్యాంగుల ప్రత్యేకావసరాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం

>ట్రాన్స్‌జెండర్లకు ఆయుష్మాన్ భారత్ వర్తింపు

>పుణ్యక్షేత్రాల పర్యటన కోసం రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో వృద్ధులకు చేయూత

>పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా ఉచిత విద్యుత్

>డెయిరీ సహకార సంఘాల సంఖ్య పెద్ద మొత్తంలో పెంపు

>కూరగాయల సాగు, వాటి నిల్వల కోసం ప్రత్యేక క్లస్టర్లు

>ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం

>ఎప్పటికప్పుడు పంటల మద్ధతు ధరల పెంపు

>వ్యవసాయ అవసరాల నిమిత్తం ప్రత్యేక ఉపగ్రహం

>విమానయాన రంగానికి ఊతం

> విద్యుత్ వాహన రంగానికి ప్రోత్సాహం

>వందేభారత్ విస్తరణ

>దేశం నలుమూలలా బుల్లెట్ రైలు

>గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి, వినియోగానికి ప్రోత్సాహం

>గ్రీన్ ఎనర్జీ, ఫార్మా, సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్, ఇన్నొవేషన్, లీగల్ ఇన్సూరెన్స్, వాహన రంగాల్లో ప్రపంచ స్థాయి హబ్‌ల ఏర్పాటు

>అంతరిక్ష రంగాల్లో భారత సామర్థ్యాన్ని పెంచేందుకు కచ్చితమైన ప్రణాళిక

>విదేశీయుల్లోని భారతీయుల భద్రతకు హామీ

> ఉద్యోగ నియామకాల్లో పేపర్ లీకేజీల నివారణకు కఠిన చట్టం, పారదర్శకంగా నియామక ప్రక్రియ

>అంకురాలకు నిధులు, మెంటర్‌షిప్‌తో నిధులు

>యూనిఫాం సివిల్ కోడ్ అమలు

> మనదేశ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తాం : Modi

> వ్యవసాయ రంగంలో డ్రోన్‌ల వినియోగానికి ప్రోత్సాహం: Modi

>ఒకే దేశం – ఒకే ఎన్నిక అమలు: Modi

>మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం: Modi

>ఫుడ్ ప్రాసెసింగ్ హబ్‌గా భారత్: Modi

>వచ్చే అయిదేళ్లపాటు ఉచిత రేషన్: Modi

>పేదలకు మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం: Modi

>70 ఏళ్లపైబడిన వృద్ధులనూ ఆయుష్మాన్ భారత్‌లో చేరుస్తాం: Modi

Recent

- Advertisment -spot_img