HomeTelugu Newsవివాహేతర సంబంధం కేసులో ఎస్. ఐ, కానిస్టేబుల్ సస్పెండ్

వివాహేతర సంబంధం కేసులో ఎస్. ఐ, కానిస్టేబుల్ సస్పెండ్

ఇదే నిజం, చేర్యాల : వాళ్లు ఇద్దరూ పోలీసు శాఖలో పని చేసేవారే. ఒకరు ఎస్ ఐ, మరొకరు కానిస్టేబుల్.. ఆ ఇద్దరూ వివాహేతర సంబంధం పెట్టుకున్నారనే ఆరోపణల తో సస్పెండ్ చేశారు ఐజీపీ ఏవీ రంగనాథ్. సిద్దిపేట కమిషనరేట్ కు చెందిన కొమురెల్లి ఎస్. ఐ గా విధులు నిర్వహిస్తున్న యం. నాగరాజు తో పాటు, కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ పి. శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐజీపి శ్రీ ఎ. వి. రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొమురేల్లి ఎస్. ఐ నాగరాజు, కానిస్టేబుల్ శ్రీనివాస్ ఇరువురు తమ భార్యలకు విడాకులు ఇవ్వకుండా పరాయి స్త్రీలతో సహజీవనం చేస్తున్నట్లుగా ఇరువురు పోలీస్ అధికారులపై ఆరోపణలు రావడంతో పాటు ఎస్. ఐ నాగరాజు భార్య తన పిల్లల కోసం కొమురెల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేసిన విషయం విధితమే. ఈ విషయమై సిద్దిపేట పోలీస్ కమిషనర్ విచారణ జరిపి ఇచ్చిన నివేదికలో ఆరోపణలు నిర్ధారణ కావడంతో ఐజీపీ సీరియస్ గా తీసుకున్నారు. పోలీస్ విభాగం కీర్తి ప్రతిష్ట భంగం కలిగించే విధంగా ఎస్. ఐ, కానిస్టేబుల్ పరాయి స్త్రీలతో సహజీవనం చేస్తున్నందుకు ఎస్.ఐ. నాగరాజు, కానిస్టేబుల్ శ్రీనివాస్ సస్పెండ్ చేస్తున్నట్లుగా మల్టీ జోన్ 1 ఐ జి పి శ్రీ ఏవి రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు.

Recent

- Advertisment -spot_img