ఇదేనిజం, ములుగు ప్రతినిధి : మంత్రి సీతక్క సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్, సిర్పూర్ నియోజకవర్గ ఇన్చార్జి రావి శ్రీనివాస్ ఆధ్వర్యంలో హైదరాబాదులోని మంత్రి సీతక్క నివాసంలో దహెగం మండల హాత్తిని సర్పంచ్ సుజాత, పి. పి రావుకాలనీ సర్పంచ్ శంకర్, సాలిగం సర్పంచ్ ప్రభాకర్, మాడవెల్లి సర్పంచ్ లచ్చక, వార్డు మెంబర్లు, బీఆర్ఎస్ నాయకులు, చింతలమానేపెల్లి మండల బాబాపుర్ సింగిల్ విండో డైరెక్టర్ రామయ్య, గంగాపూర్ ఉప సర్పంచ్ నరసింహులు తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఇది కూడా చదవండి: ఆడవారికి భారీషాక్.. ఫ్రీ బస్సు సౌకర్యంపై హైకోర్టులో పిటిషన్
ఇది కూడా చదవండి: పాపం.. సీఎం రేవంత్ ఇంగ్లిష్ చూసి.. ఫుల్ ట్రోల్స్..