Homeఫ్లాష్ ఫ్లాష్INCOME TAX:తప్పుడు ఆదాయపు వివరాలు సమర్పించారా ..జైలుకు వెళ్ళక తప్పదు

INCOME TAX:తప్పుడు ఆదాయపు వివరాలు సమర్పించారా ..జైలుకు వెళ్ళక తప్పదు

INCOME TAX: ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం ఆదాయ వివరాలను తప్పుగా సమర్పించినా, మరియు అర్హత లేని మినహాయింపులు/తగ్గింపులు వారి ఆదాయం నుంచి కోరినా, తరువాతి పరిణామాలు చాల కఠినంగా ఉంటాయి. ఈ పరిణామాలలో పన్నెండు శాతం వడ్డీ, రెండు వందల శాతం పన్ను పెనాల్టీ రూపంలో వసూలు చేయడంతోబాటు, ప్రాసిక్యూషన్ చేసి రెండు సంవత్సరాల జైలు శిక్షను కూడా విధించే పర్యవసానాలు ఉంటాయి.

అయితే, ఈ ప్రక్రియలో తప్పుడు క్లెయిమ్స్ చేసి రిఫండ్ పొందిన పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను చట్టం లోని సెక్షన్ 139 (8A) ప్రకారం మదింపు సంవత్సరాలు 2021-22, మరియు 2022-23 కు సవరించిన రిటర్న్స్ దాఖలు చేసి, 140 3 సెక్షన్ ప్రకారం పన్ను చెల్లించాలి. మదింపు సంవత్సరం 2023-24. కొరకు ఇప్పటికే రిటర్న్స్ సమర్పించినవారు 13M (3) సెక్షన్ ప్రకారం సవరించిన రిటర్న్స్ దాఖలు పరచవచ్చును.

పైన పేర్కొనబడ్డ విషయాల |తీవ్రత దృష్టా మదింపు సంవత్సరాలు;2023-24, 2022-23. 2021-22 కోసం దాఖలు చేసిన రిటర్న్స్ లోని అర్హతలేని తప్పుడు క్లెయిమ్స్ ను సరిచూసుకుని, పునఃపరిశీలన తరువాత, సవరించిన రిటర్న్స్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని పన్ను చెల్లింపుదారులకు ఆదాయపుపన్ను శాఖ విజ్ఞప్తి చేసింది

Recent

- Advertisment -spot_img