Homeహైదరాబాద్latest Newsపెరుగుతున్న వాతావరణ గాలి కాలుష్యం

పెరుగుతున్న వాతావరణ గాలి కాలుష్యం

  • ఆయుర్థాయంలో సగటున 5.3 సంవత్సరాల కోత
  • విపరీతంగా పెరుగుతున్న పీఎం 2.5 అణువులు
  • గాలి కాలుష్యంతో పెరుగుతున్న మరణాలు

ఇదే నిజం, కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిది దుండిగల్, జీడిమెట్ల, భాచుపల్లి ప్రాంతాల్లో రోజు రోజుకు వాతావరణం మరింత కాలుష్యం అవుతుంది. రోజు రోజుకు గాలి నాణ్యత పడిపోతుంది. ఔటర్ రింగురోడ్డుకు అతి సమీపంలో ఉండడంతో భారీ వాహనాలు ఇటువైపుగా రోజూ వందలు వేళల్లో తిరుగుతుంటాయి. దీనికి తోడు కాలం చెల్లిన వాహనాలకు సైతం పెయింటింగ్ వేసి లాగిస్తుంటారు. వాయు కాలుష్యము కారణంగా నగరంలో ప్రతీ ఏటా 1500 మంది వరకు మరణిస్తున్నట్లు ఓ నివేదికలో పేర్కొన్నారు. “ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జనరల్” ఇటీవల ఓ అధ్యాయాన్ని ప్రచురించింది. వాయు కాలుష్యం కారణంగా ఎన్ని మరణాలు సంభవిస్తున్నాయనే అంశంపై ఆ నివేదికలో వెల్లడించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిది లోని పలు ప్రాంతాల్లో వాయు కాలుష్యం నిత్యం పెరుగుతూ పోతుంది. దీంతో వాహనాలతో గాలి మరింత కలుషితం అవుతుంది. గాలి మరియు పొగతో ఒక్క హైదరబాద్ నగరంలో ప్రతీ ఏటా 5.6 శాతం మరణాల నమోదైనట్లు తెలుస్తుంది. మెషిన్ లెర్నింగ్ సాంకేతికతతో రూపొందించిన అత్యాధునిక పద్దతులద్వారా (పర్టిక్యులేటర్ మీటర్) “ఫీఎం 2.5” రేణువుల స్థాయిలను అంచనా వేశారు. ఈ గాలి కాలుష్య రేణువుల ద్వారా ముక్కులోని వెంట్రుకలను, శ్లేషాన్ని సులభంగా దాటివేసి శరీరంలోకి ప్రవేశిస్తాయి. అనంతరం అవి తీవ్ర అనారోగ్యానికి గురిచేస్తాయి. దీర్ఘ కాలికంగా మనుషుల్ని అనారోగ్యానికి గురిచేసి చివరకు ప్రాణాలను హరిస్తాయి. తీవ్రమైన దగ్గు, జలుబు, ఆస్తమా కారణంగా ఊపిరితిత్తులపై ప్రభావం పడుతుంది. తద్వారా శ్వాసలో లోపం ఏర్పడి మరణానికి దారి తీస్తుంది. ఈ దూలి కణాల్లో ప్రతీ 10 మైక్రో గ్రాముల పెరుగుదలకు 1.17 మరణాల శాతం పెరుగుతుందని వెల్లడైంది. అయితే 2008, 2019 మధ్య కాలంలో “ఫీఎం” 2.5 సూక్ష్మ దూళి కణాల ప్రభావం కారణంగా సంభవించిన మరణాలపై అధ్యయనం నిర్వహించారు. క్యూబిక్ మీటర్ 15 మైక్రో గ్రాముల కంటే చాలా ఎక్కువని పరిశోధకులు వెల్లడించారు. దూలీ కణాలు క్యూబిక్ మీటర్ కు మరణాలు 1.42 శాతం పెరుగుదల నమోదు అవుతుందని గతంలో అంచనా వేశారు.

Recent

- Advertisment -spot_img