Homeజాతీయం‘ఇండో-పసిఫిక్’లో డ్రాగన్‌కు చెక్.. భారత్‌-జపాన్ మధ్య కీలక సైనిక ఒప్పందం

‘ఇండో-పసిఫిక్’లో డ్రాగన్‌కు చెక్.. భారత్‌-జపాన్ మధ్య కీలక సైనిక ఒప్పందం

న్యూఢిల్లీః ఇండో-పసిఫిక్ రీజియన్ లో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోన్న చైనాకు చెక్ పెట్టేలా భారత్ పావులు క‌దుపుతుంది. భారత్, జపాన్ మధ్య మిలటరీ లాజిస్టిక్స్ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్ర‌కారం రెండు దేశాల సైన్యాలు పరస్పర స‌హ‌క‌రించుకోవ‌డంతోపాటు జపాన్ ఆధీనంలోని సైనిక, నౌకా స్థావరాలను భారత్ వాడుకునేలా, అదే సమయంలో భారత్ ఆధీనంలోని రక్షణ స్థావరాలను జపాన్ వాడుకునేందుకు ఈ ఒప్పందం వీలు క‌లిగిస్తోంది. ఈ మేరకు భారత రక్షణ శాఖ గురువారం ఒక‌ ప్రకటన చేసింది. భారత్ తరఫున రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్, జపాన్ తరఫున ఆ దేశ రాయబారి సుజుకి సతోషి ‘‘మ్యూచువల్ లాజిస్టిక్ సపోర్ట్ అగ్రిమెంట్(ఎంఎల్ఎస్ఏ)పై సంతకాలు చేసినట్లు ఆ ప్రకటనలో తెలిపారు. భారత్ ఇదివరకే అమెరికా, ఫ్రాన్స్, సౌత్ కొరియా, సింగపూర్, ఆస్ట్రేలియాలతోనూ సైనిక లాజిస్టిక్స్ ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇండో-పసిఫిక్ రీజియన్ లో పరస్పరం సహకరించుకుకోవాలని భారత్-ఫ్రాన్స్-ఆస్ట్రేలియాలు అంగీకారానికి రావ‌డం చరిత్రాత్మక మలుపుగా పరిశీలకులు భావిస్తున్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img