India squad for the Champions Trophy: ఈ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ నాయకత్వంలో 15 మంది సభ్యులతో కూడిన బలమైన జట్టును ఎంపిక చేసింది. వెన్ను గాయం కారణంగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్ట్‌కు దూరమైన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు. అలాగే ప్రపంచ కప్ తర్వాత జట్టుకు దూరంగా ఉన్న మరో భారత పేసర్ మహ్మద్ షమీకి జట్టులో చోటు లభించింది. గ్రూప్ ఎలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి.
ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు(India squad for the Champions Trophy):


రోహిత్ శర్మ (సి), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్), రిషబ్ పంత్ (వికెట్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్.
ALSO READ: Sarpanch Elections in Telangana: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు అప్పుడే?