India vs England 1st ODI: టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య వన్డే సిరీస్ కు రంగం సిద్ధమైంది. నేడు తొలి వన్డే నాగ్‌పూర్‌లో జరగనుంది. వన్డే ఫార్మాట్ లో ఇంగ్లాండ్ కంటే టీం ఇండియా ముందుంది. హెడ్-టు-హెడ్ రికార్డు చూస్తే.. ఈ ఫార్మాట్ లో ఇప్పటివరకు రెండు జట్ల మధ్య 107 మ్యాచ్ లు జరిగాయి. ఇంగ్లాండ్ 44 మ్యాచ్ లు గెలిచింది, భారతదేశం 58 మ్యాచ్ లు గెలిచింది. మూడు మ్యాచ్ లు టైగా ముగిశాయి. నాగ్‌పూర్ పిచ్ ఫాస్ట్ బౌలర్ల కంటే స్పిన్నర్లకు బాగా అనుకూలంగా ఉంటుంది. భారత జట్టులో ఒకరు ఇద్దరు కాదు, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా రూపంలో నలుగురు స్పిన్నర్లు ఉన్నారు. ఇప్పుడు నాగ్‌పూర్ వన్డేలో ఎవరికి అవకాశం లభిస్తుందో చూడాలి.
సచిన్ రికార్డుపై కోహ్లి కన్ను
ఈ మ్యాచ్ కు ముందు, టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత చేరువయ్యాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 14 వేల పరుగుల మైలురాయిని సాధించిన బ్యాటర్గా సచిన్ రికార్డ్కి కోహ్లి కేవలం 94 పరుగుల దూరంలో ఉన్నాడు. సచిన్ ఈ మైలురాయిని చేరడానికి 350 ఇన్నింగ్స్లు తీసుకోగా కోహ్లి ప్రస్తుతం 283 వన్డే మ్యాచ్లలో 58.18 సగటుతో 13,906 పరుగులు చేశాడు.
India vs England 1st ODI PLAYING XI
ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్(w), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(c), లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్.
టీమిండియా ప్లేయింగ్ XI(అంచనా) : రోహిత్ శర్మ (NE), శుభ్‌మన్ గిల్ (VS), విరాట్ కోహ్లీ, వాషింగ్టన్ సుందర్, KL రాహుల్, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ / రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.
ALSO READ: ఇందిరమ్మ ఇళ్ల పై కీలక ప్రకటన.. అర్హులందరికి ఇండ్లు..!