Homeహైదరాబాద్latest NewsIndia vs Pakistan టికెట్లు కొనే స్తోమత లేని అమెరికన్స్.. ఆరోజు ఖాళీగా మైదానం?

India vs Pakistan టికెట్లు కొనే స్తోమత లేని అమెరికన్స్.. ఆరోజు ఖాళీగా మైదానం?

India vs Pakistan match

ఇదేనిజం, వెబ్‌డెస్క్ : ఆ రోజు లీవ్ పెట్టాలా లేదా వర్క్ నుంచి తొందరగా ఇంటికి వెళ్లాలా? పనులేవీ పెట్టుకోకూడదు. పోస్ట్‌పోన్ చేస్కోవాలి. బిగ్ స్క్రీన్‌లో కచ్చితంగా మ్యాచ్ చూడాలి. ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేయాలి…ఇలా ఎన్నో ప్లాన్స్ చేసుకుంటున్నారు టీమిండియా అభిమానులు. ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ కోసం. నరాలు తెగే ఉత్కంఠ, నెయిల్ బెట్టింగ్ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. ఇదీ ఇండియాలో అభిమానుల పరిస్థితి. ఎక్కడైనా సరే ఈ మ్యాచ్ అంటే ఉండే క్రేజే వేరు. టికెట్స్ అయితే నెల ముందే సోల్డ్ అవుతాయి. కానీ ప్రస్తుత పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. న్యూయార్క్‌లో జరగనున్న ఈ మ్యాచ్‌కు టికెట్లు ఇంకా సోల్డ్ కాలేదట. ఐసీసీ వెబ్‌సైట్‌లో ఇంకా చాలా టికెట్లు అందుబాటులో ఉన్నట్లు చూపిస్తోంది. ప్రీమియం లాంజ్ క్లబ్, డైమండ్ క్లబ్ లాంజ్ రేంజ్‌లో వందలాది టికెట్లు అందుబాటులో ఉన్నాయి. కేవలం రూ.300 ధర ఉన్న టికెట్లు మాత్రమే పూర్తిగా సోల్డ్ అవుట్ అయినట్లు తెలుస్తోంది. ఏ టోర్నీ అయినా ఇండియా – పాక్ మ్యాచ్‌కు టికెట్లు ఇంత నెమ్మదిగా అమ్ముడవడం ఇదే మొదటిసారిగా నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు.

India vs Pakistan match

టికెట్లు రేట్లు విపరీతంగా పెంచడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇదే టోర్నీలో న్యూయార్క్ స్టేడియంలో జరిగిన భారత్- ఐర్లాండ్ మ్యాచ్​కు ప్రీమియమ్ టికెట్1000 డాలర్లు ఉండగా, ఇండోపాక్ మ్యాచ్​కు 2500 డాలర్లకు పెంచారు. ఇక డైమండ్ ప్రీమియమ్ సీట్ అత్యధికంగా 10,000 డాలర్లు (రూ. 8.30 లక్షలు)గా నిర్ణయించారు.

దీనిపై క్రికెట్ అనలిస్ట్​లు స్పందించారు. ‘అమెరికన్లకు క్రికెట్ గురించి ఎక్కువగా తెలియదు. అందుకనే తెలియని గేమ్ కోసం అంత ఎక్కువ ధర టికెట్లు కొనుగోలు చేసి స్టేడియానికి వెళ్లాలనుకోరు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

Recent

- Advertisment -spot_img