Homeహైదరాబాద్latest News"ఇండియన్ 2" ఆడియో లాంచ్ కి డేట్ ఫిక్స్..?

“ఇండియన్ 2” ఆడియో లాంచ్ కి డేట్ ఫిక్స్..?

దర్శకుడు శంకర్ దర్శకత్వంలో యూనివర్సల్ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “ఇండియన్ 2”. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్‌లో విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ అలాగే సిద్ధార్థ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ రిలీజ్‌కి ముందే తమిళనాట నిర్మాతలు ఆడియో లాంచ్‌ని గ్రాండ్‌గా ప్లాన్‌ చేస్తున్నారనే ఆసక్తికర వార్త వినిపిస్తోంది. చెన్నైలో ఆడియో లాంచ్‌ ఈవెంట్ మే 15న నిర్వహించనున్నారట. అలాగే ఈ వేడుకకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సూపర్ రజనీకాంత్ ఇద్దరూ హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక క్లారిటీ రానుండగా, విడుదల తేదీపై కూడా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించింది

Recent

- Advertisment -spot_img