Indian soldier : పహల్గామ్ ఉగ్రదాడి మరువకముందే పాకిస్థాన్ మరో దారుణానికి పాల్పడింది. భారత సైనికుడిని పాకిస్థాన్ బందీ చేసింది. సరిహద్దు భద్రతా దళానికి చెందిన ఒక సైనికుడిని పాకిస్తాన్ సైన్యం ఖైదీగా తీసుకుందని భద్రతా దళాల అధికారులు తెలిపారు. భారత సైనికుడు ఫిరోజ్‌పూర్‌లో అనుకోకుండా సరిహద్దు దాటి పాకిస్తాన్‌లోకి వెళ్ళాడు. ఆ సైనికుడు తమ భూభాగంలోకి ప్రవేశించినందుకే ఆ సైనికుడిని అదుపులోకి తీసుకున్నట్లు పాకిస్తాన్ సైన్యం వెల్లడించింది. అయితే పాకిస్తాన్ వ్యాఖ్యలను బిఎస్ఎఫ్ అధికారులు తీవ్రంగా ఖండించారు. తమ సైనికుడు సరిహద్దు దాటలేదని తప్పుడు ఆరోపణలపై పాకిస్తాన్ సైన్యం తమ సైనికుడిని ఖైదీగా తీసుకుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సైనికుడిని వెంటనే విడుదల చేయాలని, లేనిపక్షంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సీనియర్ అధికారులు హెచ్చరించారు.