Homeహైదరాబాద్latest Newsన్యూయార్క్‌లో 365 రోజులు పనిచేయనున్న భారత కాన్సులేట్

న్యూయార్క్‌లో 365 రోజులు పనిచేయనున్న భారత కాన్సులేట్

న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ ఆఫీస్ సంవత్సరం పొడవునా సేవలు అందించనుంది. సెలవు దినాల్లో (శని, ఆది, ప్రభుత్వ సెలవు దినాలు) మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు తెరిచే ఉంటుందని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఈ సదుపాయం అత్యవసర వీసా, ఎమర్జెన్సీ, మృతదేహాల తరలింపు వంటివాటికే వర్తిస్తుందని , సాధారణ సర్వీసులకు కాదని స్పష్టం చేసింది. ఏవైనా సందేహాలుంటే 19178157066 నంబర్‌కు కాల్ చేయొచ్చని సూచించింది.

ప్రస్తుతం అమెరికాకు ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం భారత్ నుంచి అధిక మొత్తంలో వెళుతున్నారు. కాన్సులేట్ ఆఫీసుల్లో సిబ్బందిని పెంచినప్పటికీ అత్యవసర సేవలకు ఇబ్బందులు తలెత్తుతోన్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img