Indiramma Illu : తెలంగాణలోని ఇళ్లు లేని నిరుపేదలకు రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Illu) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో తొలిదశలో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక సూచనలు చేశారు. గ్రామ స్థాయిలో ఏర్పడిన ఇందిరమ్మ కమిటీలు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేయడంలో చాలా జాగ్రత్తగా పనిచేయాలని అన్నారు. కమిటీలు తయారుచేసిన అర్హుల జాబితాను తహశీల్దార్, ఎంపీడీఓ, ఇంజనీర్లతో కూడిన మండల స్థాయి బృందం క్షేత్ర స్థాయిలో వ్యక్తిగతంగా తనిఖీ చేసి ధృవీకరించాలని ఆదేశించారు. అనర్హులకు ఇళ్లు కేటాయించినట్లు తేలితే, వెంటనే ఇందిరమ్మ కమిటీకి తెలియజేయాలని.. ఆ స్థలంలో అర్హులైన వారికి ఇళ్లు కేటాయించాలని సీఎం ఆదేశించారు. అలాగే అనర్హుల పేర్లు కూడా పధకం నుండి రద్దు చేయాలనీ వెల్లడించారు. మోసాలకు పాల్పడిన వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలి అని తెలిపారు.ప్రభుత్వం ఇప్పటికే L1, L2, మరియు L3 జాబితాలను సిద్ధం చేసింది. L1 లో ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తున్నారు.