Inflation : అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రంగా తెలంగాణ
Inflation : దేశంలో అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రంగా నిలిచింది తెలంగాణ. 10.7 శాతం ద్రవ్యోల్బణంతో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది.
బిహార్ 4.7 శాతం ద్రవ్యోల్బణంతో చివరి స్థానంలో ఉంది.
గత నెలలో నమోదైన ద్రవ్యోల్బణం గణాంకాలివి.
గత నెలలో దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి 7 శాతానికి చేరింది.
దేశ ద్రవ్యోల్బణం కంటే తెలంగాణ ద్రవ్యోల్బణమే ఎక్కువగా ఉంది.
రాష్ట్రాల వారీగా చూస్తే ద్రవ్యోల్బణం గణాంకాలు వేరువేరుగా ఉన్నాయి.
అన్ని రాష్ట్రాలపై దేశ ద్రవ్యోల్బణం ప్రభావం ఒకేలా ఉండదు.
సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు 7 శాతం కంటే ఎక్కువ ద్రవ్యోల్బణాన్ని కలిగి ఉన్నాయి.
అందువల్ల కొన్ని రాష్ట్రాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
ద్రవ్యోల్బణం ప్రభావంతో ధరలు విపరీతంగా పెరుగుతాయి.
సరుకుల రవాణా సరిగ్గా లేకపోవడం వల్ల జమ్ము-కాశ్మీర్, లదాఖ్, అరుణాచల్ ప్రదేశ్, లక్షద్వీప్, సిక్కింలలో ఆహార పదార్థాల ధరలు భారీగా పెరిగాయి.
గతేడాదితో పోలిస్తే దేశంలో ఆహార పదార్థాల ధరలు 7.7 శాతం పెరిగితే, కూరగాయల ధరలు 17.4శాతం పెరిగాయి.
వంట నూనెలు, చేపలు, కోడి గుడ్ల ధరలు ప్రతి నెలా పెరుగుతున్నాయి.
అయితే, ఈ ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉన్నాయి.
మే నెలతో పోలిస్తే జూన్‌లో కూరగాయల ధరలు 4 శాతం పెరిగాయి.
పౌల్ట్రీ ఉత్పత్తుల ధరలు 5 శాతం పెరిగాయి. దేశవ్యాప్తంగా పండ్లు, పప్పుల ధరలు మాత్రం తగ్గుతున్నాయి.
అయినప్పటికీ సీజన్‌నుబట్టి వీటి ధరలు పెరిగే అవకాశం ఉంది.
జూలైలో టమాట ధరలు తగ్గాయి.
చక్కెర, టీ పౌడర్, పప్పులు, వంట నూనెల ధరలు ఈ నెలలో తగ్గుముఖం పట్టాయి.
ఆహార పదార్థాలతో పాటు దుస్తులు, పాదరక్షలు, హౌజింగ్, హెల్త్ ప్రొడక్ట్స్ ధరలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.