Homeహైదరాబాద్latest News23 ఏళ్ల తర్వాత ఇన్ఫోసిస్‌లో

23 ఏళ్ల తర్వాత ఇన్ఫోసిస్‌లో

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 25,994 మంది ఉద్యోగులు తగ్గిపోయారు. 2001 తర్వాత తొలిసారిగా ఒక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్య తగ్గడం ఇన్ఫోసిస్‌లో ఇదే తొలిసారి అని తాజాగా ఫలితాల ప్రకటన సందర్భంగా వెల్లడించింది. ప్రస్తుతం ఇన్ఫోసిస్ కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,17,240 గా ఉండగా.. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 7.5 శాతం వరకు తగ్గింది. ఇక త్రైమాసికం పరంగా చూస్తే కిందటి త్రైమాసికంతో పోలిస్తే జనవరి- మార్చి సమయంలో ఇన్ఫోసిస్‌లో ఉద్యోగుల సంఖయ్ 5423 తగ్గింది. ఉద్యోగుల్ని సంస్థ తొలగించడం లేదా వారే బయటకు వెళ్లడం జరిగిందన్నమాట. ఇక ఉద్యోగుల సంఖ్య ఇన్ఫీలో వరుసగా ఐదో త్రైమాసికంలోనూ తగ్గింది.

ఇక కంపెనీ అట్రిషన్ రేటు విషయానికి వస్తే గత 12 నెలల డేటాను బట్టి చూస్తే స్వల్పంగా తగ్గింది. అంతకుముందు ఇది 12.9 శాతంగా ఉండగా.. ఇప్పుడు 12.6 శాతానికి దిగొచ్చింది. అట్రిషన్ రేటు అంటే సిబ్బంది వలసలు. అంటే సంస్థ ఉద్యోగులు.. ఇతర కంపెనీల్లోకి వెళ్లడం అన్నమాట. ఐటీ కంపెనీల్ని కొంతకాలంగా అట్రిషన్ రేటు వేధిస్తోంది. ఈ కారణంతో కూడా ఉద్యోగుల సంఖ్య తగ్గుతోంది. ఆ ఖాళీల్ని ఇతరులతో భర్తీ చేసేందుకు నియామకాలు కూడా చేపట్టట్లేదు.

Recent

- Advertisment -spot_img