HomeTelugu Newsఇన్పోసిస్ సుధా నారాయణ మూర్తి పెళ్లి ఖర్చు ఎంతో తెల్సా..? అక్షరాల..

ఇన్పోసిస్ సుధా నారాయణ మూర్తి పెళ్లి ఖర్చు ఎంతో తెల్సా..? అక్షరాల..

ఐటీరంగంలో భారత్ ఖ్యాతి ప్రపంచానికి చాటిన వారిలో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఒకరు. దేశంలో ఎంతో మంది ఇన్పోసిస్ సుధా నారాయణ మార్తులను ఆదర్శంగా తీసుకుంటారు. అయితే తాజాగా సుధామూర్తి, నారాయణ మూర్తులను వివాహానికి అయిన ఖర్చుకు సంబంధించిన విషయం బయటకొచ్చింది.

వారి పెళ్లికి అయిన మొత్తం ఖర్చు సరాసరి రూ.800 అంటే అశ్యర్యపోక తప్పదు. ఈ విషయాన్ని స్వయంగా సుధామూర్తి వెల్లడించారు. వివాహాన్ని సింపుల్ గా చేసుకోవాలని వీరిద్దరూ.. నిర్ణయించుకొని చెరో రూ.400 ఖర్చు చేసి వివాహం చేసుకున్నారు. పైగా వీరి పెళ్లి హాజరయ్యింది ఏడుగురే. అరగంటలోనే పెళ్లి పూర్తియిందట. ఆ సమయంలో మూర్తి దగ్గర డబ్బులు లేకపోయేవని, తానే ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వచ్చేదని సుధామూర్తి ఓ ఇంటర్వ్యూ చెప్పారు.

నారాయణ మూర్తి మాట్లాడుతూ.. సుధను ఇన్ఫోసిస్ కు దూరం పెట్టి చాలా తప్పుచేశానని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థలో ఆరుగురు వ్యవస్థాపకులు, తన కంటే సుధనే ఎక్కువ అర్హురాలని అన్నారు. కొందరు ప్రొఫెసర్లతో మాట్లాడినప్పుడు తన నిర్ణయం తప్పని చెప్పారని పేర్కొన్నారు. సుధను కలిసేందుకు టికెట్ లేకుండా ఒకసారి రైలులో 11 గంటలు ప్రయాణించిన విషయాన్ని నారాయణమూర్తి గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తాను ప్రేమలో ఉండడంతో శరీరంలోని హార్మోన్లు ఉరకలెత్తేవని నవ్వుతూ.. చెప్పారు.

ఇన్ఫోసిస్ స్థాపించిన తొలినాళ్లలో నారాయణ మూర్తి పడిన కష్టాలు ఎలా ఉండేవో ఇటీవల విడుదల ఆయన ఆత్మకథ ‘యాన్ అన్‌కామన్ లవ్: ద ఎర్లీలైఫ్ ఆఫ్ సుధా అండ్ నారాయణమూర్తి’లో వెల్లడించారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img