Homeజిల్లా వార్తలుజిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి: ఏ ఐ ఎస్ ఎఫ్...

జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి: ఏ ఐ ఎస్ ఎఫ్ కమిటీ

ఇదే నిజం నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని సూపర్డెంట్ విద్య అధికారి నరేందర్ కి ఏఐఎస్ఎఫ్ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మధు గౌడ్, బలముల ప్రేమ్ కుమార్ అధ్యక్షతన వినతిపత్రం అందజేశారు. అనంతరం వాళ్లు మాట్లాడుతూ.. ఏ ఐ ఎస్ ఎఫ్ సమక్షంలో నాగర్ కర్నూల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో మౌనిక వసతులు లేనటువంటి పరిస్థితులు నాగర్ కర్నూల్ జిల్లా ఉన్నది, ప్రభుత్వ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు యూనిఫార్మ్స్ తాగునీరు మరియు బాత్రూం సమస్యలు చాలా దారుణంగా ఉన్నాయి. వీటి విషయంపై ఉన్నత అధికారులు తక్షణమే చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించే విధంగా ఉండాలని కోరడం జరిగింది. కొన్ని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు లేకున్నా పాఠశాల నడపడం జరుగుతుంది. తక్షణమే ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసే విధంగా ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాలని లేని క్రమంలో అఖిల భారత విద్యార్థి సమైక్య నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో పోరాటాలు చేస్తామని డిమాండ్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నరేష్, స్టీఫెన్, మధు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img