Homeహైదరాబాద్latest Newsప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి.. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల సందర్శన

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి.. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల సందర్శన

ఇదే నిజం, కోహెడ: నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకుని, ప్రభుత్వ పాఠశాలలను సమస్యలకు నిలయాలుగా కాకుండా ఉన్నత విద్యా అందించే కేంద్రాలుగా మార్చాలని, సరైన వసతులు కల్పించాలని ఏఐఎస్ఎఫ్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి జేరిపోతుల జనార్దన్ అన్నారు.ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు మంగళవారం రోజున జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలను ఏఐఎస్ఎఫ్ నాయకులతో కలిసి ఆయన సందర్శించడం జరిగింది.అనంతరం విద్యార్థులతో, మధ్యాహ్న భోజన కార్మికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జనార్థన్ మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసి, ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తూ పేద, మధ్యతరగతి విద్యార్థులు చదివే ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోలేదని, అదే విధంగా విద్యకు బడ్జెట్లో కనీస నిధులు కేటాయించకుండా విద్యా వ్యవస్థను నాశనము చేసిందని,ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని పోరాటాలు చేసిన పట్టించుకోలేదని ఆయన అన్నారు. కానీ ఈ ప్రభుత్వం కూడా అదే కోవలో పోతే ఊరుకోం అని,మధ్యాహ్న భోజన పథకానికి మరిన్ని నిధులు కేటాయించాలని, విద్యార్థులకు మంచి పౌష్టిక ఆహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి ఎంఈఓ పోస్టులను కూడా భర్తీ చేయాలని మరియు రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న అటెండర్ మరియు స్కావెంజర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా భవిష్యత్తులో ఉద్యమించాల్సి వస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సిద్దుల సుమన్,ఆకారపు శ్రావణ్ కుమార్, నీరుగంటి శ్రీనివాస్, రమేష్, రాజేందర్,ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img