Homeజిల్లా వార్తలువసతి గృహాలలో మౌలిక వసతులు కల్పించాలి: ఏ ఐ ఎఫ్ డి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు...

వసతి గృహాలలో మౌలిక వసతులు కల్పించాలి: ఏ ఐ ఎఫ్ డి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు పల్లె మురళి

ఇదే నిజం,శేరిలింగంపల్లి: వసతి గృహాలలో మౌలిక వసతులు కల్పించాలని ఏ ఐ ఎఫ్ డి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు పల్లె మురళి డిమాండ్ చేశారు. సోమవారం మాదాపూర్ డివిజన్ గోపాల్ నగర్ లోని శేరిలింగంపల్లి  మైనారిటీ బాలుర గురుకుల స్కూల్, కాలేజ్ లనుఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా పల్లె మురళి మాట్లాడుతూ…. రాష్ట్రంలో ఉన్నటువంటి వసతి గృహాలు సమస్యల వలయంలా మారిపోయాయన్నారు. విద్యార్థులు సరైన వసతులు లేక తీవ్రమైన నీటి కొరతతో బాధపడుతున్నారని తెలిపారు.  400 మంది విద్యార్థులు పాఠశాల, కళాశాల వసతి గృహాలలో ఉంటున్నా కేవలం రెండు వాటర్ ట్యాంకర్లతో రోజంతా గడపాల్సిన పరిస్థితి ఉందన్నారు. కావున వసతి గృహంలో ఉన్న సమస్యలను వెనువెంటనే పరిష్కరించాలని నీటి కొరతను అధిగమించే విధంగా రోజుకు నాలుగు ట్యాంకర్లను పంపించే విధంగా ఏర్పాట్లు చేయాలని పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని సమస్యను శాశ్వతంగా పరిష్కరించుటకు మైనారిటీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్  పాఠశాల కళాశాలకు ఖానామెట్ పరిధిలో సర్వేనెంబర్ 42 లో ప్రభుత్వం మంజూరు చేసిన స్థలంలో వెనువెంటనే నిర్మాణాలు ప్రారంభించాలన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకులాలకు, సంక్షేమ హాస్టళ్లకు తక్షణమే మౌలిక వసతులు కల్పించాలి అదేవిధంగా సొంత భవనాలు నిర్మించాలని ఎఐఎఫ్ డీ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు  పల్లె మురళి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Recent

- Advertisment -spot_img