Homeహైదరాబాద్latest Newsవినూత్న నిరసన.. కేటీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకులు దీటి నర్సింలు

వినూత్న నిరసన.. కేటీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకులు దీటి నర్సింలు

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. దుబ్బాక రోడ్డు ను మంజూరు చేసి, పనులు ప్రారంభించి, శిలాఫలకం కట్టించారు. కానీ రోడ్డు మాత్రం పూర్తి కాలేదు. అందువల్ల ఆ శిలాఫలకం వద్ద కాంగ్రెస్ నాయకులు సారుకు రాకేష్, దిటి నర్సింలు కలిసి కేటీఆర్ చిత్రపటానికి పువ్వులు చల్లి కొబ్బరికాయ కొట్టి వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్నటి రోజున కొందరు బిఆర్ఎస్ కార్యకర్తలు చేసిన ఆరోపణలను వ్యతిరేకిస్తూ దుబ్బాక రోడ్డు ముస్తాబాద్ నుంచి మోయినికుంట వరకు 14 కోట్లతో రోడ్డు నిర్మాణం కొరకు మాజీ మంత్రి కేటీఆర్ మంజూరు చేసి ఆ పనులను గాలికి వదిలేసి మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. అలాగే గతంలో పోతుగల్ రోడ్డు కోసం ధర్నాలు చేశామని అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని నిరసనలు ధర్నా కార్యక్రమాలు చేపట్టిన మాపై అక్రమ కేసులు పెట్టారు గాని ఇంతవరకు డిగ్రీ కాలేజ్ తేలేని అసమర్ధత మంత్రి కేటీఆర్ అని అంతేగాక గత అసెంబ్లీ ఎన్నికల్లో వారానికి రెండు రోజులు స్థానికంగా ఉంటానని చెప్పి నెలకో రెండు నెలలకు ఒకసారి వచ్చి వెళుతున్నారు తప్ప ప్రజా సమస్యలపై స్పందించని అసమర్ధత మంత్రి అని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సారుగు రాకేష్, సద్ది మధుసూదన్ రెడ్డి, వెంకటేష్, ప్రశాంత్, బన్నీ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img