Homeఆంధ్రప్రదేశ్మార్చి 1 నుంచి ఏపీలో ఇంటర్​ పరీక్షలు

మార్చి 1 నుంచి ఏపీలో ఇంటర్​ పరీక్షలు

– 18 నుంచి టెన్త్​ ఎగ్సామ్స్​
– పరీక్ష తేదీలను ప్రకటించిన మంత్రి బొత్స

ఇదే నిజం, ఏపీ బ్యూరో: ఏపీలో మార్చి 1 నుంచి ఇంటర్మీడియట్​ పరీక్షలు, మార్చి 18 నుంచి టెన్త్​ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు మంత్రి బొత్స సత్యనారాయణ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్​ విడుదల చేశారు. మార్చి 18 నుంచి 31 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని బొత్స తెలిపారు. మార్చి 1 నుంచి 15 వరకు ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తామన్నారు. ఇంటర్ ప్రాక్టీకల్స్ ఫిబ్రవరి 5 నుంచి 25 వరకు థియరీ పరీక్షలు మార్చి 1 నుంచి 15 వరకు ఉంటాయని మంత్రి బొత్స వివరించారు. 6 లక్షల మంది టెన్త్ పరీక్షలను, 10 లక్షల మంది ఇంటర్ ఫస్ట్, సెకండియర్ పరీక్షలను రాయనున్నట్లు తెలిపారు. ఒకటే రోజు మొదటి, ద్వితీయ సంవత్సర ఇంటర్ పరీక్షలు ఉండవని.. ఆల్ట్రర్‌నేట్ డేస్‌లో జరుగుతాయని చెప్పారు. పరీక్షలు ఉదయం 9.30 నుండి 12.45 గంటల వరకు జరుగుతాయన్నారు.

Recent

- Advertisment -spot_img