Homeహైదరాబాద్latest Newsఇంటర్ ఫలితాలు..త్వరలో

ఇంటర్ ఫలితాలు..త్వరలో

AP Inter Results Update : ఏపీ ఇంటర్ ఫలితాలపై అప్డేట్ వచ్చింది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది ముందుగానే ఫలితాలు విడుదల చేయనున్నట్లు సమాచారం అందుతోంది. ఫలితాల విడుదలకు విద్యాశాఖ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. మార్చి నెలలోనే ఇంటర్, పదో తరగతి పరీక్షలు ముగిశాయి. ఇప్పటికే ఇంటర్ మొదటి, రెండో సంవత్సర జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తైందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. దీంతో ఏప్రిల్ 15న ఇంటర్ ఫస్టియర్ , సెకండియర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు మొత్తం 9,99,698 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల విడుదల అనంతరం ఇంటర్ విద్యార్థులు https://bieap.apcfss.in/Index.do లో చెక్ చేసుకోవచ్చు.

ఈసీ ఆమోదం రాగానే ఫలితాలు విడుదల
ఇంటర్‌ ఫలితాల (AP Inter Results 2024)కోసం ఎదురు చూస్తున్న విద్యార్ధులపై ఎన్నికల ప్రభావం ఉండకుండా, ఎన్నికలకు ముందే ఫలితాలను విడుదల చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్(Election Code) అమల్లో ఉండటంతో ఫలితాల వెల్లడిపై ఈసీ ఆమోదం తప్పనిసరి. దీంతో విద్యాశాఖ ఈ మేరకు ఈసీ ఆమోదం కోరినట్లు తెలుస్తోంది. ఫలితాల విడుదలతో రాజకీయ నాయకులు ప్రమేయం ఉండదు కాబట్టి…ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులే ఈసారి ఫలితాలు విడుదల చేయనున్నారు. గత ఏడాది ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలను ఏప్రిల్‌ 26న విడుదల చేశారు. మే 6న పదోతరగతి(AP 10th Results) ఫలితాలు విడుదల చేశారు. జవాబు పత్రాల మూల్యాంకనం కోసం 23 వేల మంది అధ్యాపకులను ఇంటర్‌ బోర్డు వినియోగించింది. ఇప్పటికే ఇంటర్ స్పాట్‌ వాల్యూయేషన్ ముగిసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img